
Most Eligible Bachelor: అఖిల్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్ర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులు అవుతనోన్నా ఇప్పటికీ విడుదల కాలేదు. కరోనా కారణంగా థియేటర్లు మూతపడడంతో సినిమా విడుదలను వాయిదా వేస్తూ వచ్చారు. ఓటీటీ విడుదల అనే ఊసెత్తని చిత్ర యూనిట్ సరైన సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చింది. అయితే ప్రస్తుతం ఆ సమయం రానే వచ్చేసింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎంట్రీకి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది. ఈ విషయాన్ని హీరో అఖిల్‌తో పాటు, హీరోయిన్ పూజా హెగ్డే కూడా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ఇదిలా ఉంటే నిజానికి ఈ చిత్రాన్ని గడిచిన జూన్ 19న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే కరోనా కారణంగా థియేటర్లు మూత పడడంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇక బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటు అఖిల్‌కు, అటు దర్శకుడు భాస్కర్‌కు ఈ సినిమా ఎంతో కీలకం. సరైన విజయం లేక సతమతమవుతోన్న వీరిద్దరికీ పూజా హెగ్డే లక్కీ గార్ల్‌గా మారుతుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాలి. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాసు, వాసువర్మ తెరకెక్కిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Also Read: కోవిడ్-19 పుట్టుకపై సమాచారాన్ని తొక్కిపెడుతున్న చైనా..అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆగ్రహం
JNU Entrance Exam: JNU ఎంట్రన్స్ ఎగ్జామ్ దరఖాస్తు తేదీ పొడగింపు.. చివరితేదీ ఎప్పుడంటే..?