Tollywood: కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసిన ఎన్టీఆర్.. ఇండస్ట్రీ హిట్

1977లో తెలుగు సినిమా చరిత్రలో ఒక అద్భుతమైన పోటీ జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ తాను తీయాలని భావించిన పౌరాణిక చిత్రం కురుక్షేత్రంను తొలుత ప్రారంభించారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కృష్ణ అర్జునుడిగా, శోభన్ బాబు కృష్ణుడిగా, కృష్ణంరాజు కర్ణుడిగా నటించారు.

Tollywood: కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసిన ఎన్టీఆర్.. ఇండస్ట్రీ హిట్
Krishna Vs Ntr

Updated on: Feb 28, 2026 | 9:40 PM

1977 సంక్రాంతికి ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ, కృష్ణ కురుక్షేత్రం చిత్రాలు ఒకే కథాంశంతో విడుదలయ్యాయి. కృష్ణ మొదట తన చిత్రాన్ని ప్రారంభించినా, ఎన్టీఆర్ కేవలం నెల రోజుల్లో దానవీరశూరకర్ణను పూర్తి చేసి పోటీకి దిగారు. పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ అభినయం జనాలను ఆకట్టుకోవడంతో ఆయన చిత్రం ఘనవిజయం సాధించి, కృష్ణ సినిమా డిజాస్టర్ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే..! 1977లో తెలుగు సినిమా చరిత్రలో ఒక అద్భుతమైన పోటీ జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ తాను తీయాలని భావించిన పౌరాణిక చిత్రం కురుక్షేత్రంను తొలుత ప్రారంభించారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కృష్ణ అర్జునుడిగా, శోభన్ బాబు కృష్ణుడిగా, కృష్ణంరాజు కర్ణుడిగా నటించారు. ఈ చిత్రం 1977 జనవరి 14న విడుదలయింది.

కృష్ణ తనకంటే ముందు సినిమా ప్రారంభించడంతో ఎన్టీఆర్ దీనిని ఒక ప్రతిష్టాత్మక సవాలుగా తీసుకున్నారు. కేవలం నెల రోజుల్లోనే తన దానవీరశూరకర్ణ చిత్రాన్ని పూర్తి చేశారు. కేవలం 10 లక్షల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రాన్ని కూడా 1977 జనవరి 14నే కురుక్షేత్రంకు పోటీగా విడుదల చేశారు. ఒకే కథాంశంతో రూపొందించబడిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదలవడం విశేషం. పౌరాణిక పాత్రలంటే రామారావుకు పెట్టింది పేరు. ఆయన సంభాషణలు, పద్యాలు, పాటల గానం అద్వితీయం. జనం కూడా అదే అభిప్రాయపడ్డారు. ఫలితంగా, రామారావు దానవీరశూరకర్ణకు బ్రహ్మరథం పట్టారు. కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు నటించిన కురుక్షేత్రంను ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. రామారావు ఆధిపత్యం ముందు ఈ ముగ్గురు స్టార్లు నిలబడలేకపోయారు. కురుక్షేత్రం డిజాస్టర్ అవగా, 10 లక్షలతో రూపొందించిన దానవీరశూరకర్ణ ఏకంగా మూడు కోట్లకు పైగా వసూలు చేసి సంచలన విజయం సాధించింది.

Follow Us