యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR ) అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా తారక్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అభిమానులంటే తారక్ కు ప్రాణం.. ప్రతి ఆడియో ఫంక్షన్ లో అభిమానులకు జాగ్రత్త చెప్తూ ఉంటాడు తారక్. అయితే కొద్దిరోజుల క్రితం తన అభిమాని చావు బ్రతుకుల మధ్య ఉన్న విషయం తెలుసుకొని అతడిని పరామర్శించారు తారక్. ఎన్టీఆర్ అభిమాని అయిన శ్రీకాళహస్తికి చెందిన జనార్ధన్ అనే వ్యక్తి ఇటీవల ఓ యాక్సిడెంట్‌లో గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు. అతడిని ఫోన్ లో పరామర్శించాడు తారక్. నేనున్నా అంటూ దైర్యం చెప్పాడు. కానీ ఆ అభిమాని కన్నుమూశాడు. రోడ్డు ప్రమాదానికి గురైన జనార్దన్ తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం అతడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. దాంతో తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ పోస్ట్లు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన జనార్ధన్ కోమాలోకి వెళ్ళాడు. తమ కుమారుడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్న తల్లిదండ్రులు ఎన్నివిధాలుగా ప్రయత్నించినా, జనార్ధన్ మాత్రం రెస్పాండ్ కావడం లేదు. దీంతో డాక్టర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అయితే జనార్ధన్‌కు ఎన్టీఆర్ అంటే ప్రాణం. తన చివరి కోరికగా తన అభిమాన హీరో అయిన ఎన్టీఆర్ తో మాట్లాడాలని జనార్ధన్ తల్లి సోషల్ మీడియా వేదికగా కోరింది. ఈ విషయం తెలుసుకున్న తారక్ తన అభిమాని పరిస్థితి గురించి ఆరా తీసి అన్ని విషయాలను కనుకున్నాడు. అంతేగాక జనార్ధన్ తల్లితో తమ కుటుంబానికి తాను అండగా ఉంటానని ధీమా ఇచ్చాడు. కోమాలో ఉన్న జనార్ధన్‌తో తారక్ ఫోన్ స్పీకర్ ద్వారా మాట్లాడి, అతడు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు కానీ తారక్ ప్రార్ధన ఫలించలేదు.
#NTR Always Fan Of his Fans#PrayForJanardhan
pic.twitter.com/H9bhMSNjIY— ??? ??????? ⱽᵃˢᵗʰᵘⁿⁿᵃ (@WeLoveTarakAnna) June 29, 2022