
NTR 30 Movie Update: ఆచార్య ఫెయిల్యూర్ దర్శకుడిగా కొరటాల శివ ఇమేజ్‌ను దారుణంగా డ్యామేజ్ చేసింది. అందుకే తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు చాలా కష్టపడుతున్నారు ఈ డైరెక్టర్. ఎన్టీఆర్ హీరోగా ఓ పాన్ ఇండియా యాక్షన్ డ్రామాను కొరటాల తెరకెక్కిస్తుండటం తెలిసిందే. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న ఈ సినిమా విషయంలో గతంలో జరిగిన పొరపాట్లు రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎన్టీఆర్ 30 విషయంలో ముందుగా అనుకున్న కథను మరింతగా ఫైన్ ట్యూన్ చేసి రంగంలోకి దిగారు. ముఖ్యంగా డే వన్ నుంచే ఈ సినిమాను వార్తల్లో ఉంచేందుకు ట్రై చేస్తున్నారు.
ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. పాన్ ఇండియా సినిమా కావటంతో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను ముందుగానే ఎనౌన్స్ చేశారు. ఆ తరువాత షార్ట్ గ్యాప్ తీసుకొని విలన్‌గా సైఫ్ నటిస్తున్న విషయాన్ని రివీల్ చేశారు. అయితే ఈ గ్యాప్ కూడా స్ట్రాటజిక్‌గా ప్లాన్ చేసిందే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
ఒకేసారి అన్ని విషయాలు రివీల్ చేయకుండా.. ఒక్కొక్క అప్‌డేట్‌తో సినిమాను న్యూస్‌లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్లాన్ బాగానే వర్క్ అవుట్ అయ్యింది. అలాగే ఫస్ట్ లుక్ రిలీజ్ విషయంలోనూ ఓ స్టెప్ ముందే ఉన్నారు కొరటాల. ప్రీ లుక్‌తోనే సినిమా మీద హైప్ పెంచిన మేకర్స్, త్వరలో ఫస్ట్ లుక్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు.
గతంలో షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు వస్తేగానీ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసేవారు కాదు కొరటాల. కానీ ఎన్టీఆర్ 30 విషయంలో మాత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాకముందే తొలి అప్‌డేట్‌ను సిద్ధం చేసేశారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20న తొలి అప్‌డట్‌తో సినిమా మీద బజ్‌ను పీక్స్‌కు తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యారు. ఆ రోజునే ఫస్ట్ లుక్‌తో పాటు సినిమా టైటిల్‌ను కూడా రివీల్ చేయొచ్చన్న టాక్ వినిపిస్తోంది.
మరిన్ని సినిమా వార్తలు చదవండి..