ప్రతి మనిషి ‘నో’ చెప్పడం నేర్చుకోవాలని, లేకపోతే ఇబ్బందులు తప్పవని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చెబుతున్నారు. ఆయన గత కొన్ని రోజులుగా ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో వివిధ అంశాలు గురించి తన ఆలోచనలు పంచుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ‘నో’ (కాదని చెప్పండి) అనే అంశం గురించి ఆయన మాట్లాడారు.
“మనందరం ముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయం ”నో’ చెప్పడం ఎలా. ఇది లైఫులో చాలా ఇంపార్టెంట్. ఎదుటి వ్యక్తి అడిగిన ప్రతిదానికీ ‘ఎస్’ చెబితే నువ్వు ఫెయిలైనట్టే లెక్క. ముందు ‘నో’ చెప్పండి, లేదా టైమ్ తీసుకోండి. ఆలోచించి చెప్తాను అని చెప్పండి. అన్నింటికీ అక్కడే ఆన్సర్ ఇవ్వాల్సిన పని లేదు. బాగా ఆలోచించిన తర్వాత కూడా.. నచ్చకపోతే ‘నో’ చెప్పండి. అయితే అప్పుడు చెప్పే ‘నో’.. ‘ఎస్’లా ఉండాలి. ఎదుటి వ్యక్తి హర్టవ్వకుండా ‘నో’ చెప్పడం ప్రాక్టీస్ చేయండి. లైఫులో నేను అన్నింటికీ ‘ఎస్’ చెప్పడం వల్ల చాలా కష్టాలు పడ్డా. ఎవరైనా మన ముందు ఒక ప్రపోజల్ పెడితే.. అది వాడి స్వార్థం కోసమే. మనం పెడితే, మన స్వార్థం కోసమే.. ఇందులో ‘నో’ చెప్పిన వాడే విన్ అవుతాడు. ‘నో’ మీకు శక్తిని ఇస్తుంది, అలా చెప్పిన ప్రతిసారీ హ్యాపీ ఫీల్ అవుతారు’. ‘చాలా సార్లు ‘ఎస్’ చెప్పి ఎందుకు ఒప్పుకున్నానా? అని బాధపడుతుంటారు. ఒకవేళ ఎదుటి వ్యక్తి ప్రపోజల్ మీకు కూడా బెనిఫిల్ అవుతుందని అనిపించినా.. ముందు ‘నో’ చెప్పండి. టైమ్ తీసుకుని.. ఆ తర్వాత ‘ఎస్’ చెప్పండి. అడిగిన ప్రతిదానికీ ‘ఎస్’ చెబితే.. లోకువైపోతారు. ‘వాడ్ని డీల్ చేయడం కష్టం కాదులే..’ అంటారు. ‘నో’ చెప్పగలిగేవాడే పవర్‌ఫుల్. మీరు ‘నో’ చెప్పగానే అవతలివాడు దాన్ని ‘ఎస్’లా ఫీల్ అయ్యి.. డీల్ అయిపోయిందని హ్యాపీగా వెళ్లిపోతే.. మీ అంతటి దేశముదురు మరొకరు లేరు. మీ పేరేంటో చెప్పండి. నేనొచ్చి మీ దగ్గర పని చేస్తా..” అని పూరీ కంప్లీట్ చేశారు.
Also Read : ‘అవతార్ 2’ పై కీలక అప్డేట్