వకీల్‌సాబ్‌కి లవ్ ఇంట్రస్ట్‌గా నటించి.. ఒక రొమాంటిక్ సాంగ్‌లో కూడా మెరిశారు శ్రుతిహాసన్. పవన్‌కల్యాణ్‌తో శ్రుతికి హ్యాట్రిక్ మూవీ అనే పాయింట్ కూడా సినిమాను సూపర్‌గా ప్రమోట్ చేసింది. కానీ.. సినిమా రిలీజయ్యాక మాత్రం శ్రుతి మార్క్ సౌండ్ ఎక్కడా లేదు. ఆమె ప్లేస్‌ని హైజాక్ చేసి.. హైట్స్‌లో నిలబడ్డారు మేడమ్ నివేదా. అదెలా సాధ్యమైందో తెలుసుకుందా పదండి.
చేసిన కష్టం ఊరికేపోదు అంటారు. నాలుగేళ్ల పాటు తెలుగు ఆడియన్స్‌తో అటాచ్‌మెంట్ వున్నా… ఇంకా ఏదో వెలితి ఫీలవుతున్న నివేదా థామస్… ఇప్పుడు గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. వకీల్‌సాబ్ మూవీలో మెయిన్ ఫిమేల్ లీడ్‌లో నటించి… పెర్‌ఫామెన్స్ పరంగా ది బెస్ట్ అనిపించుకున్నారు నివేదా. గతంలో తెలుగులో అరడజను సినిమాలు చేసినా రానంత క్రేజ్… ఒక్క వకీల్‌సాబ్‌తోనే సొంతం చేసుకున్నారామె.
కెరీర్ మొదలుపెట్టి ఎనిమిదేళ్లయ్యాక… తెలుగులో ఎంట్రీ ఇచ్చారు నివేదా. నానీతో ఇంద్రగంటి చేసిన ‘జెంటిల్‌మన్’ మూవీ నివేదా పెర్ఫామెన్స్‌కి మంచి స్కోప్ ఇచ్చింది. ఆమెలోని క్వాలిటేటివ్ యాక్టింగ్‌ని పసిగట్టి… నిన్నుకోరి మూవీలో మళ్లీ నానీకే జోడీగా సెట్ చేశారు శివ నిర్వాణ. భర్తకు, ప్రేమికుడికీ మధ్య నలిగే సంఘర్షణాత్మక పాత్ర ఆమెది.
ఫక్తు కమర్షియల్ మూవీస్‌ని రిజెక్ట్ చేస్తూ.. జస్ట్ పెర్ఫామెన్స్… అనే పంథాలో నడవడం నివేద స్పెషాలిటీ. స్టార్‌వ్యాల్యూ వున్న జైలవకుశ… దర్బార్ సినిమాలు కూడా క్రేజ్ పరంగా ఆమెకు ఎలివేషన్ ఇవ్వలేదు. సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురిగా… తర్వాత ‘వీ’ మూవీలో ఇద్దరు మేల్ లీడ్ క్యారెక్టర్ల మధ్య కాంప్లెక్సివ్ రోల్లో నటించినా.. బిగ్ రిజల్ట్ దక్కలేదామెకు. ఇప్పుడు వకీల్‌సాబ్ మూవీనే నివేదాను కరెక్ట్ ప్లేస్‌లో నిలబెట్టిందంటోంది ఫిలిమ్‌నగర్.
Also Read: ఆ జంతువులను చూడగానే తోకముడిచి లగెత్తిన సింహాలు.. ప్రాణభయంతో పరుగో పరుగు
పెళ్లి కొడుకు బుల్లెట్ అడిగితే వధువు తరఫువాళ్లు అపాచీ బైక్ ఇచ్చారు.. దీంతో వరుడు బట్టలు విప్పేసి