Nivetha Pethuraj: అసలు మానవత్వమే లేదా.. అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తారా ?.. హీరోయిన్ నివేదా ఎమోషనల్..

కొన్నాళ్లుగా కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా నివేదా గురించి కొన్ని అసత్య వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా తన గురించి వస్తున్న రూమర్స్ పై రియాక్ట్ అయ్యింది నివేదా. ఏదైన రాసేముందు దయచేసి నిజానిజాలు ఏంటో తెలుసుకోవాలని.. ఇప్పటికే తమ కుటుంబం ఒత్తడికి లోనవుతున్నామని.. ఒక అమ్మాయి జీవితంపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని కోరింది. ఈ మేరకు తన ఇన్ స్టాలో సుధీర్ఘ వివరణ ఇచ్చింది.

Nivetha Pethuraj: అసలు మానవత్వమే లేదా.. అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తారా ?..  హీరోయిన్ నివేదా ఎమోషనల్..
Nivetha Pethuraj

Updated on: Mar 05, 2024 | 7:28 PM

నివేదా పేతురాజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నివేదాకు అంతగా ఆఫర్స్ రాలేదు. చిత్రలహరి, అలా వైకుంఠపురంలో సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. గతేడాది విశ్వక్ సేన్ సరసన దాస్ కా ధమ్కీ సినిమాలో కనిపించింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు తమిళంలో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. కొన్నాళ్లుగా కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా నివేదా గురించి కొన్ని అసత్య వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా తన గురించి వస్తున్న రూమర్స్ పై రియాక్ట్ అయ్యింది నివేదా. ఏదైన రాసేముందు దయచేసి నిజానిజాలు ఏంటో తెలుసుకోవాలని.. ఇప్పటికే తమ కుటుంబం ఒత్తడికి లోనవుతున్నామని.. ఒక అమ్మాయి జీవితంపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని కోరింది. ఈ మేరకు తన ఇన్ స్టాలో సుధీర్ఘ వివరణ ఇచ్చింది.

“నా కోసం కొందరు భారీగా డబ్బులు ఖర్చుపెడుతున్నా తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. వాటి గురించి నేను మౌనంగానే ఉన్నాను. కానీ అలాంటి అసత్యపు మాటలు మాట్లాడేవారు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేముందు మానవత్వంతో తాము విన్న మాటలు నిజమా ? కదా ? అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు అనుకున్నాను. గత కొన్ని రోజులుగా నేను, మా కుటుంబం చాలా ఒత్తిడికి లోనయ్యాం. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. నేను చాలా గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను. 16 ఏళ్ల వయసు నుంచి నేను సంపాదిస్తున్నాను. మా కుటుంబం దాదాపు 20 ఏళ్లుగా దుబాయ్ లో ఉంటున్నాం. ఇప్పటికీ మేము దుబాయ్ లోనే ఉన్నాం. సినిమా ఇండస్ట్రీలో కూడా నాకు అవకాశం ఇవ్వమని ఏ నిర్మాతను, దర్శకుడిని, హీరోని అడగలేదు. ఇప్పటి వరకు దాదాపు 20 సినిమాల్లో నటించాను. అవన్నీ నా వరకు వచ్చిన అవకాశాలే. కానీ డబ్బు సంపాదించడానికి.. అవకాశాల కోసం ఆత్యాశతో లేను.

నా గురించి వస్తున్న వార్తలలో ఎంతమాత్రం నిజం లేదు. 2002 నుంచి దుబాయ్ లో అద్దె ఇంట్లో ఉంటున్నాం. 2013 నుంచి రేసింగ్ అనేది నా అభిరుచిగా మారింది. చెన్నైలో జరుగుతున్న రేసుల గురించి నాకు తెలియదు. మేము చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నాము. జీవితంలో ఎన్నో కష్టాల తర్వాత నేను ఈ స్థానంలో ఉన్నాను. నేను గౌరవప్రదమైన, ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. మీ కుటుంబంలోని స్త్రీలలాగే. ఈ విషయంలో నేను చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే జర్నలిజంలో ఇంకా కొంత మానవత్వం ఉందని నేను నమ్ముతాను. కాబట్టి వారు నా గురించి ఇలా చెడుగా మాట్లాడరని నేను ఆశిస్తున్నాను. కుటుంబం పేరు తీసేముందు మీకు తెలిసిన సమాచారం నిజమా అనేది తెలుసుకోండి. నాకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు ” అంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చింది నివేదా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.