Rang De Movie Review: అల్లరి చేష్టలతో సందడి చేసిన నితిన్ , కీర్తిసురేష్.. ‘రంగ్ దే’ మూవీ ఎలా ఉందంటే..

|

Mar 26, 2021 | 12:51 PM

యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్. తాజాగా రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Rang De Movie Review: అల్లరి చేష్టలతో సందడి చేసిన నితిన్ , కీర్తిసురేష్.. రంగ్ దే మూవీ ఎలా ఉందంటే..
Rang De
Follow us on

Rang De Movie Review :

సినిమా : రంగ్ దే
నటీనటులు: నితిన్, కీర్తి సురేష్
దర్శకత్వం:  వెంకీ అట్లూరి
సంగీతం: దేవీశ్రీ ప్రసాద్

యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్. తాజాగా రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ మూవీలో ముద్దుగుమ్మ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రంగ్ దే మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

అర్జున్ (నితిన్), అను (కీర్తిసురేష్) పక్కపక్క ఇళ్లలోనే ఉంటారు. చిన్ననాటినుంచి ఒకరంటే ఒకరికి పడదు.ప్రతి చిన్న విషయంలోనూ గొడవలు పడుతూ ఉంటారు.పెరిగి పెద్దయిన తర్వాత కూడా వీళ్ళ గొడవలు ఆగవు. అయితే ఈ ఇద్దరు అనుకోని పరిస్థితుల కారణంగా పెళ్లిచేసుకోవాల్సి వస్తుంది. వివాహం తర్వాత కూడా గొడవ పడుతూనే ఉంటారా? వీళ్ళ బలవంతపు పెళ్లి వెనుక కారణం ఏమిటి..? అనేది తెరపై చూడలిందే..

ఎవరెలా చేసారంటే …

నితిన్ , కీర్తి సురేష్ జంట స్క్రీన్ పైన చూడముచ్చటగా కనిపించారు.నితిన్ ఫన్నీ చేష్టలు, డైలాగ్ మాడ్యులేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చాలా బాగా చేసాడు నితిన్. ఇక కీర్తి సురేష్ కూడా అను పాత్రలో చక్కగా నటించి ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్స్ లోను కీర్తి తనదైన నటనతో ఆకట్టుకుంది. నరేష్, రోహిణి, సుహాస్, అభినవ్, వెన్నెల కిషోర్ తదితరులు తమతమ పాత్రల పరిదిలో నటించి ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం:

వెంకీ అట్లూరి తన మూడవ చిత్రం కోసం కూడా అందమైన ప్రేమకథను ఎంచుకున్నడు.  అలాగే కథను మంచి భావోద్వేగాలతో నడిపించే ప్రయత్నం చేసాడు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ పనితీరు అద్భుతంగా ఉంది. అదేవిధంగా రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ అంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అలరించింది. సినిమాలో పాటలు కూడా శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఇక సినిమా మొదటి భాగమంతా మంచి వినోదభరితంగా సాగుతుంది. సెకండ్ ఆఫ్ లో చక్కటి ఎమోషన్స్ తో సాగుతుంది. నితిన్, కీర్తి సురేష్ అల్లరి ప్రేక్షకులకు ఓ మంచి అనుభూతిని కలిగిస్తుంది.

చివరిగా : సరదాగా సాగిన రంగ్ దే..