The India House: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ది ఇండియా హౌస్‌ టీజర్‌.. రికార్డు స్థాయిలో వ్యూస్

తాజాగా మరో సారి తన వైపే అందరూ చూసేలా చేసుకుంటున్నారు ఈ కుర్ర హీరో. స్వాతంత్య్రోద్యమాన్ని ముందుడి నడిపించిన అమర వీరుల చుట్టే తన సినిమాలను ప్లాన్ చేసుకుంటూ.. త్రూ అవుట్ ఇండియా ట్రెండ్ అవుతున్నారు.

The India House: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ది ఇండియా హౌస్‌ టీజర్‌.. రికార్డు స్థాయిలో వ్యూస్
The India House Film

Updated on: May 31, 2023 | 10:14 AM

కార్తికేయ2తో రీసెంట్ డేస్లో సూపర్ డూపర్ హిట్తో పాటు.. పాన్ ఇండియన్ రేంజ్లో ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు  యంగ్ హీరో నిఖిల్.. తాజాగా మరో సారి తన వైపే అందరూ చూసేలా చేసుకుంటున్నారు ఈ కుర్ర హీరో. స్వాతంత్య్రోద్యమాన్ని ముందుడి నడిపించిన అమర వీరుల చుట్టే తన సినిమాలను ప్లాన్ చేసుకుంటూ.. త్రూ అవుట్ ఇండియా ట్రెండ్ అవుతున్నారు. భతగ్ సింగ్ బ్యాక్ డ్రాప్లో స్పై మూవీని చేస్తూనే.. మరో పక్క వీర్‌ సావర్కర్ నేపథ్యంలో ది ఇండియా హౌస్‌ సినిమాను చేస్తున్నారు.

తాజాగా ఓ టైటిల్ టీజర్‌ కూడా రిలీజ్ చేశారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సమర్పిస్తున్న ఈ మూవీ టీజరే ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. షేక్ చేయడమే కాదు.. రికార్డులు కూడా క్రియేట్ చేస్తోంది ఈ వీడియో.

దాదాపు యూట్యూబ్‌తో పాటు.. అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను కలుపుకుని ది ఇండియా హౌస్‌ టీజర్‌ దాదాపు 10 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకుంది. అంతేకాదు చిన్న టైటిల్ టీజర్‌ తోనే.. విపరీతంగా అంచనాలు పెరిగేల చేసుకుంది. రామ్‌ చరణ్ క్రేజ్‌ కూడా యాడై.. త్రూ అవుట్ ఇండియా ట్రెండ్ అవుతోంది. మరి ఈ సింబీమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో అక్కట్టుకుంటుందో చూడాలి. త్వరలోనే ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్స్ ఇవ్వనున్నారు మేకర్స్.