యంగ్ హీరో నిఖిల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మంచి హిట్స్ అందుకుంటున్నాడు. స్వామి రారా సినిమా నుంచి వరుస విజయాలను అందుకుంటున్నాడు నిఖిల్. ఇక రీసెంట్ గా కార్తికేయ 2 సినిమాతో పాటు 18 పేజెస్ సినిమాతో హిట్స్ అందుకున్నాడు నిఖిల్. ఇక ఇప్పుడు పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు ఈ కుర్ర హీరో. నిఖిల్ 19వ చిత్రానికి గూఢచారి, ఎవరు, హిట్ వంటి హిట్ చిత్రాల ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎడ్ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై కె రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. చరణ్ తేజ్ ఉప్పలపాటి సీఈఓగా వ్యవహరిస్తున్నారు.
యాక్షన్ తో కూడిన స్పై థ్రిల్లర్గా భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి స్పై అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో నిఖిల్ సరసన ఐశ్వర్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జూలియన్ అమరు ఎస్ట్రాడా సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తుండగా, దర్శకుడు గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ భాద్యతల్ని కూడా నిర్వహిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నారు.
ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ స్థాయిలో అమ్ముడయ్యాయని తెలుస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ సాటిలైట్ రైట్స్ ఏకంగా 40 కోట్లకి అమెజాన్ ప్రైమ్ స్టార్ నెట్వర్క్ సొంతం చేసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. నాట్ థీయాట్రికల్ రైట్స్ డీల్ ఈ స్థాయిలో వస్తే థీయాట్రికల్ బిజినెస్ అన్ని భాషలలో కలిసి కనీసం 60 కోట్ల వరకు జరిగే అవకాశం ఉంటుందని అంచనాలు వేస్తున్నారు.