మరికొద్ది రోజుల్లో ప్రభాస్ సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ప్రభాస్ లాస్ట్ మూవీస్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అయినా కూడా డార్లింగ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. దాంతో సలార్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను అదిరిపోయే రేంజ్ లో తెరకెక్కించాడు. సలార్ సినిమా కేజీఎఫ్ కంటే ఐదు రెట్లు పెద్దదని కేజీఎఫ్ ను మించి యాక్షన్ సీన్స్, ఎమోషనల్ ఉంటాయని అంటున్నారు చిత్రయూనిట్.
ఇక రిలీజ్‌కు ముందు సలార్ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే సలార్ సినిమా యుఎస్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అక్కడ రికార్డ్ క్రియేట్ చేసింది సలార్.. యూఎస్‌లో లేటెస్ట్ గా 8 లక్షల డాలర్స్ మార్క్ ని జస్ట్ ప్రీ సేల్స్ లోనే కొట్టేసింది సలార్. అలాగే మనదగ్గర బుక్ మై షో లో నయా రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఆన్లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్ బుక్ మై షో లో 1మిలియన్ ఇంట్రెస్ట్ లను సొంతం చేసుకుంది సలార్ సినిమా.
ఇదిలా ఉంటే ఓ యంగ్ హీరో సలార్ సినిమాను అభిమానులతో కలిసి చూడటానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే టికెట్ కూడా సాధించాడు ఆ యంగ్ హీరో. ఆయనట మరెవరో కాదు కుర్ర హీరో నిఖిల్. హైదరాబాద్ లో శ్రీ రాములు థియేటర్ లో సలార్ మిడ్ నైట్ షో 1:00 గంటలకి నిఖిల్ అభిమానులతో కలిసి సినిమా చూడనున్నాడు. నిఖిల్ ను ఓ అభిమాని సలార్ సినిమా టికెట్ కావలి అని అడగ్గా ఇలా స్పందించాడు.
SriRamulu Theatre 1 am show fix 👍🏼 #SALAAR #Prabhas bhai https://t.co/i9D8idOlB5
— Nikhil Siddhartha (@actor_Nikhil) December 15, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి