Nikhil Spy: మా సినిమా అలాంటిదే కానీ.. స్పై మూవీ పై క్లారిటీ ఇచ్చిన నిఖిల్

రీసెంట్ గా కార్తికేయ 2, 18 పేజెస్ అనే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు నిఖిల్‌ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘స్పై’. థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నిఖిల్‌కు జోడిగా ఐశ్వర్యా మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నిఖిల్‌ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Nikhil Spy: మా సినిమా అలాంటిదే కానీ.. స్పై మూవీ పై క్లారిటీ ఇచ్చిన నిఖిల్
Actor Nikhil

Updated on: May 19, 2023 | 9:22 AM

యంగ్ హీరో నిఖిల్ వరుస బిజీగా ఉన్నాడు. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకొని సినిమాలు తీస్తూ మంచి విజయాలను ఆకుందుకుంటున్నాడు ఈ యంగ్ హీరో.. రీసెంట్ గా కార్తికేయ 2, 18 పేజెస్ అనే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు నిఖిల్‌ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘స్పై’. థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నిఖిల్‌కు జోడిగా ఐశ్వర్యా మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నిఖిల్‌ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చిత్ర యూనిట్ మొదట్లో విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ ఈ అంచనాలను అందుకుందని చెప్పాలి. అలాగే రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కూడా సినిమా పై అంచనాలు పెంచేసింది.

అయితే స్పై మూవీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సినిమానే కాదు కళ్యాణ్ రామ్ హీరో నటిస్తోన్న డెవిల్ సినిమా కూడా ఇదే తరహా కథ అని టాక్. తాజాగా దీని పై క్లారిటీ ఇచ్చాడు నిఖిల్. తాజాగా స్పై మూవీ ప్రంమోషన్స్ లో నిఖిల్ మాట్లాడుతూ..

ఈ రెండు సినిమాల నేపథ్యం నేతాజీతో లింక్ అయ్యి ఉన్నా.. విభిన్నకాలాల్లో సాగే కథాంశాలతో తెరకెక్కాయని నిఖిల్ స్పష్ఠం చేశాడు. కళ్యాణ్ రామ్ సినిమా 1920లలో రన్ అయితే మా కథాంశం ప్రెజెంట్ కనెక్టివిటీతో ఫిక్షనలైజ్ చేసి ఉంటుందని వెల్లడించాడు నిఖిల్.