
Nidhi Agarwal Got Chance In Pawan Movie: ‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార నిధి అగర్వాల్. తర్వాత ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక అనంతరం వచ్చిన ‘ఈస్మార్ట్ శంకర్’ చిత్రంతో ఒక్కసారి ఫుల్ క్రేజ్ సంపాదించుకుందీ బ్యూటీ.
ఈ సినిమాలో తనం అందంతో పాటు, సైంటిస్ట్ పాత్రలో నటనతోనూ ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తమిళ చిత్రంలో నటిస్తోన్న నిధి అగర్వాల్ తాజాగా ఓ లక్కీ చాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో నిధి హీరోయిన్‌గా చాన్స్ కొట్టేసిందనేది సదరు వార్త సారాంశం. ఇప్పటికే చిత్ర యూనిట్ ఈ విషయమై నిధిని సంప్రదించగా తను కూడా ఓకే చెప్పిందని టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నిధి.. యువరాణి పాత్రలో నటించనుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వకీల్‌సాబ్ షూటింగ్‌లో బిజీగా ఉన్న పవన్ ఈ సినిమా పూర్తికాగానే క్రిష్‌తో కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నాడు.
Also read: Myntra to Change Logo : మహిళ ఇచ్చిన షాక్‌తో లోగోనే మార్చేసుకున్న ఈ-కామర్స్ దిగ్గజం