Nayanthara: వందకోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయను.. తెగేసి చెప్పిన నయనతార

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఆమె స్టార్ హీరోయిన్. అత్యధిక పారితోషికం తీసుకునే సినీతారలలో ఆమె ఒకరు. నయనతార.. సౌత్ ఇండస్ట్రీని ఏలేసిన అమ్మడు. తెలుగు, తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తన భర్త, పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తుంది.

Nayanthara: వందకోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయను.. తెగేసి చెప్పిన నయనతార
Nayanthara

Updated on: May 31, 2025 | 4:17 PM

లేడీ సూపర్ స్టార్ నయనతార నయన్ వయసు 40 సంవత్సరాలు. అయినప్పటికీ కుర్రహీరోయిన్లకు గట్టిపోటీనిస్తుంది. దశాబ్దాలుగా సినీరంగంలో కొనసాగుతున్న నయన్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.20 కోట్లు డిమాండ్ చేస్తుందని టాక్. ఇరవై ఏళ్లకు పైగా తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నయనతార.. అటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ సత్తా చాటుతుంది. ఇటీవలే జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి విజయవంతంగా అడుగుపెట్టింది. దీంతో ఆమె క్రేజ్ పాన్ ఇండియాకు చేరింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రానున్న సినిమాలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు రూ.20 కోట్లు డిమాండ్ చేస్తుందని.. ఇదివరకు ఏ హీరోయిన్ సైతం ఇంతగా పారితోషికం తీసుకోలేదని టాక్. ఇదిలా ఉంటే నయన్ ఒక్క హీరోతో మాత్రం నటించాను అని తెగేసి చెప్పిందట.. అంతే కాదు భారీ రెమ్యునరేషన్ ఇస్తా అన్న కూడా నో చెప్పిందట. రూ. 100కోట్లు ఇచ్చినా కూడా ఆ హీరో పక్క నటించాను అని చెప్పిందట.. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.. ఆ హీరో ఎవరో కాదు లెజెండ్ సినిమాతో హీరోగా మారాడు. 50ఏళ్ల వయసులో హీరో అవ్వాలనే కలను నెరవేర్చుకున్నారు శరవణన్. ప్రముఖ వస్త్ర వ్యాపారం శరవణన్ స్టోర్స్ అధినేత అయిన శరవణన్ గతంలో తన బ్రాండ్ కు తానే యాడ్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ట్రోల్స్ బారిన కూడా పడ్డారు.

ఇదిలా ఉంటే దాదాపు 60 కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియన్ లెవల్లో.. లెజెండ్‌ సినిమాను తెరకెక్కించి అందర్నీ షాక్ చేశారు. షాక్ చేయడమే కాదు.. ఆ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్స్ ఇచ్చి మరీ స్టార్ టెక్నీషియన్లను తీసుకున్నారు. ఫైనల్ గా బెస్ట్ అవుట్‌ పుట్తో.. థియేటర్లలో రిలీజ్‌ చేసి.. అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా లాంటి టాప్ బ్యూటీని హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ముందు ఈ సినిమాలో హీరోయిన్ గా నయన్ కు సంప్రదించారట.. కానీ శరవణన్ తో నటించను అని చెప్పిందట నయన్. వందకోట్లు ఇచ్చినా కూడా ఆ హీరోతో నటించాను అని చెప్పిందట. ఈ వార్త ఇప్పుడు మరోసారి వైరల్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.