AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navdeep: శుభలేఖ షేర్ చేసి షాకిచ్చిన నవదీప్.. పెళ్లి ముహుర్తం ఫిక్స్.. వధువు ఎవరంటే..

ఇటీవలే రవితేజ నటించిన ఈగల్ చిత్రంలోనూ కనిపించారు నవదీప్. అటు సినిమాల్లో నటిస్తూనే..ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు నవదీప్. నెట్టింట ట్రెండ్ అవుతున్న సాంగ్స్, డైలాగ్స్ ‏కు రీల్స్ చేస్తూ సందడి చేస్తుంటాడు. ఇక ఈ హీరోకు ఎక్కడికి వెళ్లినా పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతుంటాయని అనేకసార్లు చెప్పుకొచ్చాడు. ఇటీవల తన ఇన్ స్టాలో ఓ వీడియో పోస్ట్ చేస్తూ అందరు తనను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారని అన్నాడు.

Navdeep: శుభలేఖ షేర్ చేసి షాకిచ్చిన నవదీప్.. పెళ్లి ముహుర్తం ఫిక్స్.. వధువు ఎవరంటే..
Navdeep
Rajitha Chanti
|

Updated on: Mar 31, 2024 | 7:29 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే గుర్తొచ్చే పేరు ప్రభాస్. ఆ తర్వాత లిస్ట్‏లో ఉన్న హీరోలలో నవదీప్ ఒకరు. జై సినిమాతో హీరోగా పరిచయమై.. ఇప్పుడు సహయ నటుడిగా మెప్పిస్తున్నారు. ఇటీవలే రవితేజ నటించిన ఈగల్ చిత్రంలోనూ కనిపించారు నవదీప్. అటు సినిమాల్లో నటిస్తూనే..ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు నవదీప్. నెట్టింట ట్రెండ్ అవుతున్న సాంగ్స్, డైలాగ్స్ ‏కు రీల్స్ చేస్తూ సందడి చేస్తుంటాడు. ఇక ఈ హీరోకు ఎక్కడికి వెళ్లినా పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతుంటాయని అనేకసార్లు చెప్పుకొచ్చాడు. ఇటీవల తన ఇన్ స్టాలో ఓ వీడియో పోస్ట్ చేస్తూ అందరు తనను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారని అన్నాడు. “ప్రతిరోజూ ఇంటికి వెళ్లినా.. ఇన్ కు వెళ్లినా ఒకటే ప్రశ్న. అదెప్పుడూ అని.. చెప్తా.. చెప్తా రేపు చెప్తా.. అది నా పెళ్లి డేట్ అయ్యి ఉండొచ్చు.. లవ్ మౌళి రిలీజ్ డేట్ అయ్యి ఉండొచ్చు. ఎలక్షన్స్ లో నేను నిలబడబోతున్న నామినేషన్స్ డేట్ అయ్యి ఉండొచ్చు. అదేంటో రేపు చెప్తా.. అప్పటివరకు మీరు గెస్ చేయండి ” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు ఏకంగా పెళ్లి శుభలేఖ షేర్ చేసి షాకిచ్చాడు. అంతకు ముందు రోజే అందరు అడుగు అంతేకాదు.. ముహుర్తం ఎప్పుడు? పెళ్లి కూతురు ఎవరు ? అనే విషయాలపై కూడా క్లారిటీ ఇచ్చాడు. పెళ్లి శుభలేఖ గురించి ప్రత్యేకంగా ఓ వీడియోను సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేశాడు.

అయితే నవదీప్ షేర్ చేసిన వీడియోలో పెళ్లి శుభలేఖ కనిపించడం నిజమే. కానీ అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. శుభలేఖలో పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురు వివరాలు కాకుండా.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ లవ్ మౌళి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చాడు. నవదీప్, పంఖురి గిద్వానీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ లవ్ మౌళి. ఏప్రిల్ 19న రిలీజ్ చేస్తున్నట్లు ఆ శుభలేఖలో తెలియజేశాడు. పెళ్లి కొడుకు పేరు దగ్గర నవీదీప్ పేరు.. పెళ్లి కూతురు పేరు స్థానంలో పంఖురి గిద్వానీ పేరు.. ముహుర్తం ప్లేస్ లో సినిమా రిలీజ్ డేట్ ను చూపిస్తూ.. పెళ్లి శుభలేఖ ఎలా ఉంటుందో అచ్చం అలాగే డిజైన్ చేసి లవ్ మౌళి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. చాలా కాలం తర్వాత నవదీప్ హీరోగా నటిస్తున్న సినిమాకు ఇలా వినూత్నంగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ జనాలను ఆకట్టుకుంటున్నాడు నవదీప్.

ఇదిలా ఉంటే నవదీప్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. వాటే క్రియేటివ్ బ్రదర్.. నిజాంగానే పెళ్లి శుభలేఖ అనుకున్నామని.. లవ్ మౌళి సినిమా కోసం వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ సినిమాలో నవదీప్ లుక్స్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. సిక్స్ ప్యాక్స్ బాడీతోపాటు లాంగ్ హోయిర్ తో గుర్తుపట్టలేని విధంగా కనిపిస్తున్నాడు. ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. చాలా కాలం క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఏప్రిల్ 19న రిలీజ్ కానుంది.

View this post on Instagram

A post shared by Nav Deep 2.0 (@pnavdeep)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మార్బుల్స్ రంగు మారుతున్నాయా?.. ఈ చిట్కాలు పాటిస్తే
మార్బుల్స్ రంగు మారుతున్నాయా?.. ఈ చిట్కాలు పాటిస్తే
చెత్త కుప్పలో ఎక్స్‌పైర్డ్‌ చాక్లెట్లు.. ఎగబడిన జనం! వీడియో
చెత్త కుప్పలో ఎక్స్‌పైర్డ్‌ చాక్లెట్లు.. ఎగబడిన జనం! వీడియో
వైట్ బాల్‌లో హీరో.. రెడ్ బాల్‌లో జీరో.. పరువు తీస్తున్నావ్‌గా
వైట్ బాల్‌లో హీరో.. రెడ్ బాల్‌లో జీరో.. పరువు తీస్తున్నావ్‌గా
వర్షం కురిసింది.. పంట మురిసింది..
వర్షం కురిసింది.. పంట మురిసింది..
పొరలు పొరలుగా గుడ్డు పరాఠా.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది
పొరలు పొరలుగా గుడ్డు పరాఠా.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది
గోరింటాకు ఎర్రగా 10 నిమిషాల్లో పండాలంటే ఇది ఒక్కటి కలపండి చాలు
గోరింటాకు ఎర్రగా 10 నిమిషాల్లో పండాలంటే ఇది ఒక్కటి కలపండి చాలు
'టాక్సిక్'లో నయనతార రోల్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
'టాక్సిక్'లో నయనతార రోల్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
చాణక్య నీతి: డబ్బు విషయంలో ఈ తెలివి తక్కువ పనులు చేయకండి..!
చాణక్య నీతి: డబ్బు విషయంలో ఈ తెలివి తక్కువ పనులు చేయకండి..!
మసూద్ అజర్ ‘త్యాగం’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపిన ఐఎస్ఐ
మసూద్ అజర్ ‘త్యాగం’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపిన ఐఎస్ఐ
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. నగదు విత్ డ్రా రూల్స్‌లో మార్పులు..
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. నగదు విత్ డ్రా రూల్స్‌లో మార్పులు..