టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ హీరో నాని నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం శ్యామ్ సింగరాయ్. ఇందులో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఈ సినిమాలో నాని రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్స్, పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడిక్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్.
ఇందులో భాగంగా.. ఈరోజు సాయంత్రం 7 గంటలకు వరంగల్‌లోని హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలోని యూనివర్సిటీ కాలేజ్ గ్రౌండ్‌లో శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంతోపాటు.. రాయల్ ఈవెంట్ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకను టీవీ9 తెలుగులో ప్రత్యేక్ష ప్రసారంలో వీక్షించవచ్చు.
లైవ్..
Radhe shyam: ‘సంచారి’ గా చక్కర్లు కొడుతున్న డార్లింగ్.. రాధేశ్యామ్ నుంచి సాంగ్ టీజర్..
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకు సర్జరీ.. దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న హీరో..