Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కు ఎదో చేద్దాం అని వచ్చాడు కానీ ఏం చేయడం లేదు.. అమర్ పై నటరాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్

|

Sep 23, 2023 | 7:17 AM

మనోడు బిగ్ బాస్ లోకి వెళ్లిన దగ్గర నుంచి ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో మాత్రం విఫలం అవుతున్నాడు. సీరియల్ లో నటించిన విధంగా బిగ్ బాస్ లో పర్ఫామ్ చేయలేకపోతున్నాడు. మొదటి  రోజు నుంచి అమర్ దీప్ ఆటలో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వడం లేదు. మిగిలిన వారు ఎంతోకంత తమ ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు కానీ అమర్ దీప్ మాత్రం ఇంకా నిద్ర లేవలేదు. మొన్నామధ్య ఒక ఎపిసోడ్ లో రెచ్చిపోయిన రంకెలేసి ఓకే అనిపించుకున్నాడు.

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కు ఎదో చేద్దాం అని వచ్చాడు కానీ ఏం చేయడం లేదు.. అమర్ పై నటరాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss 7 Amardeep
Follow us on

బిగ్ బాస్ సీజన్ సెవన్ లో చాలా మంది సీరియల్ నటులు ఉన్నారు. వారిలో అమర్ దీప్ ఒకరు. అమర్ దీప్ పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితుడు. అయితే మనోడు బిగ్ బాస్ లోకి వెళ్లిన దగ్గర నుంచి ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో మాత్రం విఫలం అవుతున్నాడు. సీరియల్ లో నటించిన విధంగా బిగ్ బాస్ లో పర్ఫామ్ చేయలేకపోతున్నాడు. మొదటి  రోజు నుంచి అమర్ దీప్ ఆటలో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వడం లేదు. మిగిలిన వారు ఎంతోకంత తమ ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు కానీ అమర్ దీప్ మాత్రం ఇంకా నిద్ర లేవలేదు. మొన్నామధ్య ఒక ఎపిసోడ్ లో రెచ్చిపోయిన రంకెలేసి ఓకే అనిపించుకున్నాడు. కానీ అది మనోడికి బ్యాక్ ఫైర్ అయ్యింది. రైతు బిడ్డ పై విరుచుకుపడి కంటెంట్ ఇచ్చా అనుకున్నాడు కానీ ట్రోల్స్ మాత్రం ఓ రేంజ్ లో పడ్డాయి.

బీటెక్ చేసినోళ్ల బాధ నీకేం తెలుసు అంటూ ప్రశాంత్ పై రెచ్చిపోయిన అమర్ దీప్ ఆటలో మాత్రం వెనకపడ్డాడు. అయితే పల్లవి ప్రశాంత్ పై అమర్ దీప్ అంతగా రెచ్చిపోవాల్సిన ఆవరసం లేదు. అతను పల్లెటూరిలో ఉండదు. అతనికి రైతుల గురించే ఎక్కువ తెలుసు అందుకే రైతుల గురించి మాట్లాడాడు. దాని ఇతను పెద్ద జాతీయ సమస్యలా సాగదీసి లాగదీసి చేయాల్సిన అవసరం లేదు అంటూ చాలా మంది మండి పడుతున్నారు.అంతే కాదు కింగ్ నాగార్జున కూడా అమర్ దీప్ రెడ్ మార్క్ లో ఉన్నావు అని కూడా చెప్పాడు.  అయినా కూడా మనోడు మారలేదు. నిన్న మొన్న జరిగిన ఎపిసోడ్ లోనూ బిగ్ బాస్ జుట్టు కత్తిరించుకోమంటే నా వల్ల కాదు అంటూ చేతులెత్తేశాడు. ఏవేవో రీజన్స్ చెప్పాడు కానీ అంత కన్వీసెన్స్ గా లేవు అవి.

తాజాగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్ కూడా అమర్ దీప్ ఆట తీరు పై ఫైర్ అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా అభిప్రాయం చెప్తున్నా అంటూ.. అమర్ దీప్ ఏం చేయడానికి హౌస్ లోకి వెళ్ళాడో అది చేయడం లేదు. మొదటి వారం ఏం చేయలేకపోయాడు. రెండో వారంలో బీటెక్ వ్యవహారంతో ఓట్లు తెచ్చుకుందాం అనుకున్నాడు. కానీ అది బెడిసికొట్టింది. మేము సీరియల్ వాళ్ళం మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నాడు. ముందు నీ ఆట నువ్వు ఆడు. గ్రూప్ కట్టి గేమ్ ఆడటం రాంగ్ అని అన్నారు నటరాజ్ మాస్టర్. అలాగే మీ అందరికంటే కష్టపడి వచ్చిన ప్రశాంత్ చాలా బెటర్ అని అన్నారు. అతనిని టార్గెట్ చేయడం పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టే అని తన అభిప్రాయాన్ని చెప్పారు నటరాజ్ మాస్టర్. అలాగే రతికాను చూస్తుంటే బేబీ సినిమా గుర్తొస్తుంది అని అన్నారు. కష్టపడి వచ్చి గేమ్ ఆడుతున్నవాళ్లను కిందకు లాగాలని చూస్తుంది అని అన్నారు నటరాజ్ మాస్టర్.