Chhaava: విక్కీ కౌశల్ ఛావా పై ప్రశంసలు కురిపించిన నరేంద్ర మోదీ..

మరఠా యోధుడు ఛత్రపతి మహారాజ్ శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారం తెరకెక్కిన సినిమా ఛావా. ఈ మూవీ ఫిబ్రవరి14న రిలీజై కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇక లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా ఈ సినిమాలో నటించారు.

Chhaava: విక్కీ కౌశల్ ఛావా పై ప్రశంసలు కురిపించిన నరేంద్ర మోదీ..
Narendra Modi

Updated on: Feb 22, 2025 | 11:22 AM

విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఛావా. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో నటుడు విక్కీ కౌశల్  అద్భుతంగా నటించి మెప్పించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 14, 2025న థియేటర్లలో విడుదలైంది. తొలి షోతోనే చావా సినిమా ఆ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. చరిత్రలో చాల మందికి తెలియని ఓ గొప్ప మహారాజ్ శంభాజీ గురించి ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో విక్కీ కౌశల్ తో పాటు.. రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. చావా చిత్రానికి లక్ష్మణ్ ఉడేకర్ దర్శకత్వం వహించారు. మాడాక్ ఫిల్మ్స్‌కు చెందిన దినేష్ విజన్ నిర్మించారు. ఈ చిత్రం శివాజీ సావంత్ మరాఠీ నవల చావా  ఆధారంగా రూపొందించారు.

2025 లో రూ. 200 కోట్ల మార్కును దాటిన తొలి బాలీవుడ్ చిత్రంగా ఛావా సినిమా రికార్డు సృష్టించింది. ఛావా చిత్రం ప్రస్తుతం 2025 లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. కాగా ఛావా సినిమా పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. విక్కీ నటనతో మరోసారి దేశ ప్రజలు ఛత్రపతి శివాజీని ఆయనకు కుమారుడు శంభాజీ మహారాజ్ ను తలుచుకుంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ ఈ సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. ఇటీవల జరిగిన 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఛావా సినిమా ప్రశంసలు కురిపించారు. ఆయన మాట్లాడుతూ.. “ఛావా సినిమా ప్రస్తుతం అంతటా వినిపిస్తోందని మోదీ అన్నారు. దేశంలో మరాఠీ భాష చాలా గొప్ప దళిత సాహిత్యాన్ని అందించిందని, మహారాష్ట్ర ప్రజలు గతంలో సైన్స్, ఆయుర్వేదం, లాజికల్, రీజనింగ్ వంటి వాటికి అద్భుతమైన కృషి చేశారని మోదీ అన్నారు. మహారాష్ట్ర, ముంబై కేవలం హిందీ సినిమాలు మాత్రమే కాకుండా మరాఠీ చిత్రాల స్థాయిని పెంచడంలో కీలక పాత్ర పోషించిందని మోదీ చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.