
టాలీవుడ్ హీరో నారా రోహిత్ త్వరలో ఓ ఇంటివాడుకానున్నాడు. హీరోయిన్ శిరీషతో కలిసి ఓ కొత్త జీవితం ప్రారంభించానున్నాడు. గతేడాది అక్టోబర్ లో ఉంగరాలు మార్చుకున్న వీరు ఇప్పుడు మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టనున్నారు. నారా రోహిత్- శిరీషల పెళ్లి పనులు షురూ అయ్యాయి. మొన్న పెళ్లి కూతురు శిరీష ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఇక శనివారం కాబోయే దంపతుల హాల్దీ వేడుక ఘనంగా జరిగింది. ఆటలు, పాటలతో ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ వేడుకలో నారా రోహిత్- శిరీషలు ఎంతో అందగా కనిపించారు. హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫంక్షన్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, నెటిజన్లు కాబోయే దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా నారా రోహిత్-శిరీషల వివాహ వేడుకలు మొత్తం ఐదు రోజులపాటు భారీగా అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇప్పటికే హల్దీ వేడుక పూర్తి కాగా ఆదివారం (అక్టోబర్ 26న) నారా రోహిత్ పెళ్లి కొడుకుగా ముస్తాబు కానున్నాడు. అక్టోబర్ 28న మెహందీ, అక్టోబర్ 29న సంగీత్ నైట్ నిర్వహించనున్నారు. ఇక అక్టోబర్ 30న రాత్రి 10:35 గంటలకు నారా రోహిత్- శిరీషలు ఏడడుగులు నడవనున్నారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం. ఇందుకోసం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Glimpses from the vibrant #Haldi ceremony of #NaraRohith & #SireeLella 💛
A celebration filled with joy, love, and laughter!@IamRohithNara pic.twitter.com/Dm9Hxh62WG— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) October 26, 2025
నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి 2 సినిమాలో హీరోయిన్ గా నటించింది సిరి లేళ్ల. అప్పటి నుంచే వీరి మధ్య ప్రేమ మొదలైంది. పెద్దల అనుమతితో గతేడాది అక్టోబర్ లో నిశ్చితార్థం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు.
Nara Bhuvaneswari garu at Nara Rohith Anna Haldi Function 🥰🙏💛#NaraBhuvaneswari #NaraRohith #hyderabad #AndhraPradesh pic.twitter.com/qCIcvDiJTj
— CBN Era (@CBN_Era) October 25, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..