Nara Rohit: ‘కష్టకాలంలో అండగా నిలిచారు’.. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన హీరో నారా రోహిత్

|

Nov 18, 2024 | 6:29 PM

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో నారా, నందమూరి ఫ్యామిలీలు విషాదంలో మునిగిపోయాయి. ఇక తండ్రి మరణంతో నారా రోహిత్ పూర్తిగా కుంగిపోయాడు.

Nara Rohit: కష్టకాలంలో అండగా నిలిచారు.. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన హీరో నారా రోహిత్
Nara Rohit
Follow us on

చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నారావారి పల్లెలో ముగిశాయి. ఆదివారం సాయంత్రం ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరిగిన ఈ అంత్యక్రియల్లో నారా, నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నారా రామ్మూర్తి నాయుడికి కడసారి వీడ్కోలు పలికారు. ఇక తండ్రి మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయాడు హీరో నారా రోహిత్. దుఃఖాన్ని దిగమింగుకుంటూనే తండ్రి అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. కాగా క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు నారా రోహిత్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
‘నా తండ్రిని కోల్పోయిన సమయంలో మీరు చూపిన ప్రేమ, మద్దతుమమ్నల్ని బాగా కదిలించాయి. మీ హృదయపూర్వక సందేశాలు, ఓదార్పునిచ్చే మాటలు మా కుటుంబానికి అపారమైన ధైర్యం, శక్తినిచ్చాయి’ అని నారా రోహిత్ ట్వీట్ చేశాడు.

ఇక ఇదే సందర్భంగా తన పెదనాన్న సీఎం చంద్రబాబు నాయుడు, పెద్దమ్మ భువనేశ్వరి, అన్న లోకేశ్, వదిన బ్రాహ్మిణిలకు నారా రోహిత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారుడు. కష్ట సమయంలో తమ వెంటఉండి అండగా నిలిచారని, కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చారని రోహిత్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సినీ అభిమానులు, నెటిజన్లు నారా రోహిత్ కు ధైర్యం చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

నారా రోహిత్ ట్వీట్..

అంతకు ముందు సోషల్ మీడియా వేదికగానే తన తండ్రితో అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకన్నారు నారా రోహిత్. ‘మీరొక ఫైటర్‌ నాన్న. మీరు నాకు ప్రేమించడాన్ని నేర్పించారు. జీవితాన్ని ఎలా గెలవాలో నేర్పించారు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి మీరే కారణం. మంచి కోసం పోరాడాలని నేర్పించారు. అలాగే.. మా కోసం ఎన్నో త్యాగాలు చేశారని.. మీ జీవితంలో ఎన్నో కష్టాలున్నా అవి మా దరి చేరకుండా పెంచారు. తండ్రితో జీవితాంతం మరచిపోలేని ఎన్నో జ్ఞాపకాలు మాకున్నాయి.  ఇక చివరిగా ఏం చెప్పాలో తోచడం లేదు.. బై నాన్నా’  తండ్రిపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చాడు నారా రోహిత్.

తండ్రితో తన అనుబంధంపై..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..