Nani : నా ఆఫీస్‌లో ఈ వేషాలు ఏంటి..? యంగ్ హీరో చేసిన పనికి నేచురల్ స్టార్ రియాక్షన్

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా మారిన నాని చాలా మందికి ఆదర్శం. ఇక హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు నాని.

Nani : నా ఆఫీస్‌లో ఈ వేషాలు ఏంటి..? యంగ్ హీరో చేసిన పనికి నేచురల్ స్టార్ రియాక్షన్
Nani

Updated on: Nov 14, 2022 | 8:50 AM

నేచురల్ స్టార్ నాని హీరోగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తనదైన సహజ నటనతో నేచురల్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా మారిన నాని చాలా మందికి ఆదర్శం. ఇక హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు నాని. ఇటీవలే నాని అంటే సుందరానికి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇక ఇప్పుడు దసరా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇదిలా ఉంటే నాని హీరోగానే కాదు ప్రొడ్యూసర్ గాను రాణిస్తున్నారు. అ, హిట్ అనే సినిమాలతో ప్రొడ్యూసర్ గా సక్సెస్ అయ్యారు నాని ఇక ఇప్పుడు హిట్ 2 అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడు.

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అడవి శేష్ కు జోడీగా మీనాక్షి  చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శేష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

ఇవి కూడా చదవండి

అలాగే ఈ సినిమానుంచి తాజాగా ఓ అందమైన మెలోడీ కూడా రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా హీరో,హీరోయిన్లు ‘ఉరికే’ అనే పాటకు నాని ఆఫీస్‌లో డ్యాన్స్‌ చేశారు. ఈ వీడియోను అడవి శేష్ షేర్ చేస్తూ..లా డ్యాన్స్‌ చేయడం సిగ్గుగానే ఉంది. కానీ మీకోసం ఏదైనా చేస్తా అని రాసుకొచ్చాడు. దీనిపై నాని స్పందిస్తూ.. నా ఆఫీస్ ను ఇలా కూడా వాడొచ్చా.?’ అంటూ నాని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..