Nandamuri TarakaRatna: రేపు హైదరాబాద్‌కు తారకరత్న భౌతికకాయం.. సోమవారం అంత్యక్రియలు..

రేపు ఉదయం హైదరాబాద్‌కు తారకరత్న భౌతికకాయాన్ని తరలించనున్నారు. అలాగే అభిమానుల సందర్శన కోసం సోమవారం ఫిలిం ఛాంబర్‌కు తరించనున్నారు.

Nandamuri TarakaRatna: రేపు హైదరాబాద్‌కు తారకరత్న భౌతికకాయం.. సోమవారం అంత్యక్రియలు..
Tarakaratna

Edited By:

Updated on: Feb 18, 2023 | 10:26 PM

Taraka Ratna Passes Away: నందమూరి తారకరత్న నేడు కన్నుమూశారు. టీడీపీ యువ సారధి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో సినీ నటుడు తారకరత్న కూడా పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా లోకేష్‌తో కలిసి నడుస్తుండగా.. తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదాయలకు తరలించారు. మెరుగైన వైద్యం అందించారు. విదేశాల నుంచి కూడా వైద్యులను రప్పించి చికిత్స అందించారు. కానీ, ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు.

తారకరత్న మరణ వార్తతో సినీ లోకంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. నందమూరి ఫ్యామిలీకి పలువురు ప్రగాఢసానుభూతి తెలుపుతున్నారు.

సోమవారం అంత్యక్రియలు..

తారకరత్న మృతదేహాన్ని రేపు ఉదయానికి మోకిలలోని తన నివాసానికి తరలిస్తారు. ఎల్లుండి (సోమవారం) ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు. ఈ రోజు రాత్రి 11.30 గంటలకు నారాయణ హృదయాలయ నుంచి తారకరత్నను కుటుంబసభ్యులు హైదరాబాద్ తరలించనున్నారు.