Tollywood: ఒకప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. తండ్రి ఆరోగ్యం కోసం సినిమా కెరీర్ త్యాగం.. ఎవరో గుర్తు పట్టారా?

ఈ కింది ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆయన ఒకప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో. గొప్పింటి కుటుంబం నుంచి వచ్చాడు. తనదైన నటనతో ఆడియెన్స్ కు దగ్గయ్యాడు. అయితే అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని దగ్గరుండి చూసుకునేందుకు తన సినిమా కెరీర్ ను సైతం త్యాగం చేశాడు.

Tollywood: ఒకప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. తండ్రి ఆరోగ్యం కోసం సినిమా కెరీర్ త్యాగం.. ఎవరో గుర్తు పట్టారా?
Nandamuri Kalyan Chakravarthy

Updated on: Dec 07, 2025 | 10:54 AM

టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ఛాంపియన్. లేటెస్ట్ సెన్సేషన్ అనస్వరా రాజన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రదీప్‌ అద్వైతం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జీ స్టూడియోస్‌ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్, కాన్సెప్ట్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇందులో రాజి రెడ్డి అనే ఓ పవర్ ఫుల్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ను చూసిన ఆయనను గుర్తు పట్టలేకపోయారు. కానీ ఈ కటౌట్ ను ఎక్కడో చూసినట్లు ఉందేనని అలా ఓ సారి వెనక్కు వెళ్లిపోయారు.

మరి పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఈయన ఒకప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో. 1980-90వ దశకాల్లో కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా చిరంజీవి, రాజశేఖర్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో సహాయక నటుడిగాను మెప్పించారు. అయితే ఉన్నట్టుండి సినిమాలు దూరమయ్యాడీ టాలీవుడ్ ట్యాలెంటెడ్ యాక్టర్. తన తండ్రి అనారోగ్యం కారణంగా ఆయనను దగ్గరుండి చూసుకొనేందుకు ఈ హీరో తన సినీ జీవితాన్ని కూడా త్యాగం చేశాడు. ఇంతకీ అతనెవరంటే నందమూరి వంశం నుంచి వచ్చిన హీరో కల్యాణ్ చక్రవర్తి. నందమూరి తారక రామారావు తమ్ముడు, నిర్మాత త్రివిక్రమరావు కుమారుడే కళ్యాణ్ చక్రవర్తి. 1986లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అత్తగారూ స్వాగతం సినిమా ద్వారా చిత్రసీమలోకి అరంగేట్రం చేసాడు.

తలంబ్రాలు’, ‘మాయా కోడలు సవాల్’, ‘ఇంటి దొంగ’, ‘దొంగ కాపురం’, ‘అక్షింతలు’, ‘మారణ హోమం’, ‘రుద్ర రూపం’, ‘అత్తగారు జిందాబాద్’, ‘రౌడీ బాబాయ్’, ‘జీవన గంగ’, ‘ప్రేమ కిరీటం’, ‘మేనమామ’, ‘అగ్ని నక్షత్రం’ తదితర చిత్రాలతో ఆడియెన్స్ కు దగ్గరయ్యాడు కల్యాణ్ చక్రవర్తి. 1989లో చిరంజీవి హీరోగా నటించిన ‘లంకేశ్వరుడు’ సినిమాలో కళ్యాణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మూవీ తర్వాత ఆయన హఠాత్తుగా సినిమాలకు దూరమయ్యారు. మళ్లీ ఇప్పుడు సుమారు మూడున్నర దశాబ్దాల తర్వాత ‘ఛాంపియన్’ సినిమా కోసం మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. ఇందులో ఆయన రాజిరెడ్డి అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.

ఛాంపియన్ సినిమాలో నందమూరి కల్యాణ్ చక్రవర్తి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.