త‌న‌ బ‌ర్త్ డే రోజున అభిమానుల‌కు బాల‌య్య రివ‌ర్స్ గిప్ట్..రచ్చ రంబోలా

జూన్ 10.. న‌ట‌సింహ నంద‌మూరి బాలకృష్ణ పుట్టినరోజు. ఆయ‌న అభిమానుల‌కు పండుగ రోజు. అదేరోజు త‌న ఫ్యాన్స్ కు అదిరిపోయే కానుక అందించబోతున్నారు బాల‌య్య‌.

త‌న‌ బ‌ర్త్ డే రోజున అభిమానుల‌కు బాల‌య్య రివ‌ర్స్ గిప్ట్..రచ్చ రంబోలా

Updated on: Jun 03, 2020 | 6:46 AM

జూన్ 10.. న‌ట‌సింహ నంద‌మూరి బాలకృష్ణ పుట్టినరోజు. ఆయ‌న అభిమానుల‌కు పండుగ రోజు. అదేరోజు త‌న ఫ్యాన్స్ కు అదిరిపోయే కానుక అందించబోతున్నారు బాల‌య్య‌. బ‌ర్త్ డే సంద‌ర్భంగా తన కొత్త చిత్రం నుంచి ఓ సర్​ప్రైజ్​ ఇవ్వ‌నున్నారు. ప్రస్తుతం బాలయ్య తన 106వ చిత్రాన్ని మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్నారు. ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. అయితే ఈ మూవీ టైటిల్‌, ఫస్ట్‌లుక్‌తో పాటు ఓ పాటను మూవీ యూనిట్ రిలీజ్ చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు టాక్ నడుస్తోంది​.

ఇక్క‌డ‌ విశేషమేమిటంటే.. ఆ పాటను పాడింది స్వయంగా బాలయ్యేనట. ఆయన గతంలో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘పైసా వసూల్’ మూవీ కోసం ‘మామా ఏక్‌ పెగ్‌లా’ అనే సాంగ్ ఆలపించి అద‌ర‌గొట్టారు. ఇప్పుడు మరోసారి బోయపాటి చిత్రం కోసం..బాల‌య్య‌ గొంతు సవరించుకున్నట్లు స‌మాచారం. ఇప్పటికే ఈ సాంగ్ రికార్డింగ్‌ కూడా పూర్తయినట్లు తెల‌స్తోంది. తాజాగా ఈ విష‌యానికి సంబంధించి రీసెంట్ ఇంటర్వ్యూలో చిన్న హింట్‌ ఇచ్చారు బాల‌య్య‌. “త్వరలో మళ్లీ నా పాటతో సోష‌ల్ మీడియాలో సందడి చేయబోతున్నా. దీనికి పెద్దగా టైమ్ కూడా తీసుకోవాలనుకోవట్లేదు. మరో నాలుగైదు రోజులంతే” అంటూ పాటపై అభిమానుల‌కు ఆత్రుత పెంచారు బాలకృష్ణ. ఈ మూవీ కోసం ‘మోనార్క్‌’ అన్న టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.