Telugu Indian Idol S2 : నయా అవతార్‌లో నటసింహం.. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కోసం ఇలా..

|

Mar 13, 2023 | 5:58 PM

తెలుగు ఇండియన్ ఐడల్ ఇప్పటికే విజయవంతంగా సీజన్ వన్ ను పూర్తి చేసుకుంది. మొదటి సీజన్‌లో శ్రీ రామ్ చంద్ర హోస్ట్‌గా వ్యవహరించగా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నిత్యామీనన్, సింగర్ కార్తీక్ జడ్జ్ లుగా వ్యవహరించారు.

Telugu Indian Idol S2 : నయా అవతార్‌లో నటసింహం.. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కోసం ఇలా..
Balakrishna
Follow us on

తెలుగు కంటెంట్ అందిస్తోన్న ఏకైక ఓటీటీ సంస్థ ఆహా నుంచి ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు, ఆకట్టుకునే టాక్ షోలతో అలరిస్తోంది. అలాగే సూపర్ సింగింగ్ కాంపిటేషన్ తెలుగు ఇండియన్ ఐడల్‌తో ఎంతో మంది గాయని గాయకులను పరిచయం చేసింది ఆహా. తెలుగు ఇండియన్ ఐడల్ ఇప్పటికే విజయవంతంగా సీజన్ వన్ ను పూర్తి చేసుకుంది. మొదటి సీజన్‌లో శ్రీ రామ్ చంద్ర హోస్ట్‌గా వ్యవహరించగా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నిత్యామీనన్, సింగర్ కార్తీక్ జడ్జ్ లుగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు సీజన్ 2 కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఎంతో మంది ప్రతిభావంతులైన సింగర్స్ ఈ ఆడిషన్ లో పాల్గొన్నారు. ఇక త్వరలోనే తెలుగు ఇండియన్ కాంపిటేషన్ గ్రాండ్ గా ప్రారంభం కానుంది. కాగా ఈ సీజన్ 2 కోసం ఎంపిక అయిన సింగర్స్ ను పరిచయం చేస్తూ ఓ స్పెషల్ ఎపిసోడ్ ను ప్లాన్ చేసింది ఆహా. ఈ ఎపిసోడ్ కు గల విత్ బాల అనే ట్యాగ్ ఇచ్చారు.

ఈ స్పెషల్ ఎపిసోడ్‌లో నటసింహం నందమూరి బాలకృష్ణ స్సెషల్ అట్రాక్షన్ కానున్నారు. నయా అవతార్‌లో బాలయ్య ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది ఆహా.

ఈ ఫొటోస్‌లో బాలయ్య సూపర్ స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చారు. డబుల్ ఎనర్జీతో బాలయ్య ప్రేక్షకులను ఆకట్టుకున్నారని ఈ ఫోటోలు చూస్తే అర్ధమవుతుంది. ఇక సీజన్ 2 కు హోస్ట్ గా హేమ చంద్ర హోస్ట్ గా వ్యవహరించనున్నారు. అలాగే తమన్ , సింగర్ గీతామాధురి, సింగర్ కార్తీక్ జడ్జ్ లుగా వ్యవహరించనున్నారు. త్వరలోనే బాలయ్య స్పెషల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.