
వరసగా రెండు హిట్లు వచ్చేసరికి ఎవరి మాటా వినేలా కనిపించడం లేదు బాలయ్య. చేస్తున్న సినిమాను పక్కనబెడితే.. మరో మూడు సినిమాలకు ఓకే అనేసారు. ఒకేసారి నాలుగు ప్రాజెక్ట్స్ వర్కవుట్ చేస్తున్నారు నందమూరి నటసింహం. మరి అనిల్ రావిపూడి తర్వాత బాలయ్య పని చేయబోయే ఆ దర్శకులు ఎవరు..? సినిమాలేంటి..? తెలుసుకుందాం పదండి. అఖండ, వీరసింహారెడ్డి రికార్డులతో తగ్గేదే లే అంటున్నారు బాలయ్య. ముఖ్యంగా రొటీన్ కథతో వచ్చిన వీరసింహారెడ్డి.. పండక్కి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. తొలిరోజే 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం.. ఆ తర్వాత 4 రోజుల్లోనే మరో 50 కోట్లు వసూలు చేసి 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమా తర్వాత బాలయ్య జోరు మరింత పెరిగింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు ఈ సీనియర్ హీరో.
సంక్రాంతికి ముందే అనిల్ రావిపూడి సినిమా షెడ్యూల్ ఒకటి పూర్తైంది. త్వరలోనే రెండో షెడ్యూల్ షురూ కానుంది. ఇదిలా ఉంటే అనిల్ తర్వాత మరో ముగ్గురు దర్శకులు చెప్పిన కథలు బాలయ్య ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఈ లిస్టులో బోయపాటి శ్రీను ఉన్నారు. అఖండకు సీక్వెల్ చేయాలని ఉందని.. చేస్తామని ఈ మధ్యే అనౌన్స్ చేసారు బాలయ్య. ఇక అన్‌స్టాపబుల్ యాడ్ షూట్ చేసిన ప్రశాంత్ వర్మతోనూ బాలయ్య సినిమా ఉంది. అన్‌స్టాపబుల్ టైమ్‌లోనే ప్రశాంత్ వర్మ టేకింగ్‌కు ఫిదా అయిన బాలయ్య.. ఆయనతో సినిమాకు సిద్ధమైపోయారు. చెరుకూరి సుధాకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు.
ఇక బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మాణంలో బాలయ్య సినిమా ఉండబోతుంది. ఈ మధ్యే కథ కూడా ఫైనల్ అయిపోయింది. వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ కూడా బాలయ్య కోసం కథ సిద్ధం చేస్తున్నారు. మొత్తానికి మరో మూడేళ్ళ వరకు బాలయ్య డైరీ ఫుల్ అయిపోయింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి