అడవి శేష్ మరో హిట్ కొట్టాడు.. హిట్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్ హీరో శేష్. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాకు నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా శుక్రవారం విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. శైలేష్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శేష్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో చిత్ర యూనిట్ అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా గతంలో వచ్చిన హిట్ సినిమాకు సీక్వెల్ గా వచ్చింది ఈ మూవీ..ఓ సక్సెస్ ఫుల్ సినిమాకు సీక్వెల్ అన్నపుడు కచ్చితంగా ఆ ప్రెజర్ ఉంటుంది. దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేసి.. అంచనాలు అందుకుంటేనే రిజల్ట్ పాజిటివ్‌గా ఉంటుంది. ఈ విషయంలో ‘హిట్’ దర్శకుడు శేలేష్ కొలను సక్సెస్ అయ్యాడు.
ఇక ఈ సినిమా పై సినిమా తారలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ హిట్ 2 సినిమాను చూశారు. సినిమా చూసి చిత్రయూనిట్ ను హీరో అడవి శేష్ ను నిర్మాత నానికి కంగ్రాట్స్ తెలిపారు బాలయ్య. బాలయ్యతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశాడు శేష్.
నందమూరి బాలకృష్ణ సర్ కి సూపర్ నచ్చింది హిట్ 2. బాలయ్య సార్ దర్శకుడు శైలేష్ విజన్ ను నా నటనను ఎంతగానో మెచ్చుకున్నారు. బాలయ్య సార్ ను కూడానా హిట్ మూవీలో ఒక్కసారి కనుపించమని అడిగాను న నవ్వుతూ.. ఆయన కూడా నవ్వేశాడు. బ్రదర్ నానితో హిట్ 2 సెలబ్రేషన్స్ అని రాసుకొచ్చారు అడవి శేష్. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
#NBK sir ki super nacchindhi #HIT2 ! What lovely compliments from Balayya sir about @KolanuSailesh vision & my performance. I made a small joke that we request him for an appearance in the #HIT verse ?He smiled…but you never know! #HIT2 celebrations with big bro @NameisNani pic.twitter.com/5y8e33ngFm
— Adivi Sesh (@AdiviSesh) December 4, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.