Nagarjuna – Puri Jagannadh : ఒకరు టాలీవుడ్ టాప్ హీరో.. మరొకరు టాలీవుడ్ టాప్ డైరెక్టర్.. ఇప్పుడు ఈ ఇద్దరు ఇండైరెక్ట్‌గా తలపడబోతున్నారు. ఇండైరెక్ట్‌గా అంటే.. ఎలా అని ఆలోచిస్తున్నారా.. ఇంకెలా వీరు తనయుల సినిమాలను బరిలో దించి. ఇంతకీ ఈ టాప్ హీరో.. ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా.. కింగ్ నాగార్జున.. పూరీ జగన్నాథ్.
అసలు విషయం ఏంటంటే. జూన్ 19వ తేదీ నాగార్జున తనయుడు అఖిల్ నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని చాలా ముందుగానే గీతా ఆర్ట్స్ సంస్థ ప్రకటించింది. అఖిల్ కు ఇది చాలా ప్రతిష్టాత్మకమైన చిత్రం.
ఇప్పుడు సరిగ్గా దానికి ఒక రోజు ముందు పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాశ్ హీరోగా నటించిన ‘రొమాంటిక్’ మూవీని రిలీజ్ చేయబోతున్నాడు. అనిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి పూరి, ఛార్మి నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. మరి నాగార్జునతో మంచి రిలేషన్ ఉన్న పూరి జగన్నాథ్ ‘రొమాంటిక్’ను అఖిల్ సినిమాతో పాటే బరిలో ఉంచుతాడో లేదో.. లేక ఈ రెండు సినిమాలు యూత్ ను టార్గెట్ చేసిన క్రేజీ లవ్ స్టోరీసే! కనుక మరేం పర్లేదని లైట్ తీసుకుంటాడో లేదో… చూడాలి మరి!
మరిన్ని ఇక్కడ చదవండి :
Friendship : ఆకట్టుకుంటున్న ‘ఫ్రెండ్ షిప్’ మూవీ టీజర్.. బజ్జీకి ఆల్ ది బెస్ట్ తెలిపిన ఫ్రెండ్స్..