Allu Arjun: అల్లు అర్జున్ కంటే ముందు ఆ టాలీవుడ్ హీరో రెండు సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు.. ఆయన ఎవరో తెలుసా.?

బన్నీ కి అవార్డు అనౌన్స్ చేయడంతో ఆయన కుటుంబసభ్యులు ఆనందంలో తేలిపోయారు. ఇక అభిమానులైతే సంబరాలు జరుపుకుంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకుగాను అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా ఎంపికయ్యాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ ఉరమాస్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 69 ఏళ్ళ సినీ చరిత్రలో ఓ తెలుగు హీరోకి ఉత్తమ నటుడి కేటగిరిలో అవార్డు రావడం ఇదే మొదటి సారి.

Allu Arjun: అల్లు అర్జున్ కంటే ముందు ఆ టాలీవుడ్ హీరో రెండు సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు.. ఆయన ఎవరో తెలుసా.?
Allu Arjun

Updated on: Aug 26, 2023 | 10:00 AM

తెలుగు సినిమాలకు జాతీయ అవార్డుల పంట పండింది. 69వ జాతీయ అవార్డుల జాబితా విడుదల చేశారు. తెలుగులో ఆర్ఆర్ఆర్, పుష్ప, ఉప్పెన, కొండపోలం సినిమాలు అవార్డులను దక్కించుకున్నాయి. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా ఎపిక అయ్యారు. బన్నీ కి అవార్డు అనౌన్స్ చేయడంతో ఆయన కుటుంబసభ్యులు ఆనందంలో తేలిపోయారు. ఇక అభిమానులైతే సంబరాలు జరుపుకుంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకుగాను అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా ఎంపికయ్యాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ ఉరమాస్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 69 ఏళ్ళ సినీ చరిత్రలో ఓ తెలుగు హీరోకి ఉత్తమ నటుడి కేటగిరిలో అవార్డు రావడం ఇదే మొదటి సారి. కానీ అల్లు అర్జున్ కంటే ముందు ఓ హీరోకి రెండు సార్లు జాతి అవార్డు దక్కింది. ఆ హీరో ఎవరో తెలుసా..?

అల్లు అర్జున్ నిజంగా చరిత్ర సృష్టించాడు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న మొట్టమొదటి హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు. అయితే గతంలో జాతి అవార్డును ఓ హీరో రెండు సార్లు అందుకున్నారు. ఆ హీరో మరెవరో కాదు కింగ్ నాగార్జున. అవును నాగార్జున ఇప్పటికే 2 జాతీయ అవార్డులను అందుకున్నారు. కానీ బెస్ట్ యాక్టర్ గా కాదు. ఆయనకు రెండు వేరువేరు విభాగాల్లో జాతీయ అవార్డు దక్కింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.