AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani: నేషనల్ అవార్డ్స్ విషయంలో నాని గట్టిగానే హర్ట్ అయ్యాడనుకుంటా..?

ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు అల్లు అర్జున్. ఉత్తమ నటుడిగా 69ఏళ్లుగా ఒక్క టాలీవుడ్ హీరో కూడా జాతీయ అవార్డు అందుకోలేకపోయారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఆ రికార్డ్ ను క్రియేట్ చేశారు. తెలుగు సినిమాల్లో పుష్ప, కొండపోలం, ఆర్ఆర్ఆర్, ఉప్పెన సినిమాలకు అవార్డుల పంట పండింది. ఉత్తమ తెలుగు సినిమాగా ఉప్పెన సినిమా అవార్డు అందుకుంది. ఉత్తమ నటుడిగా పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్‌ అవార్డు అందుకున్నాడు.

Nani: నేషనల్ అవార్డ్స్ విషయంలో నాని గట్టిగానే హర్ట్ అయ్యాడనుకుంటా..?
Nani
Rajeev Rayala
|

Updated on: Aug 26, 2023 | 8:35 AM

Share

69 నేషనల్ అవార్డ్స్ జాబితా విడుదల చేశారు. తెలుగు సినిమాలకు ఈసారి జాతీయ అవార్డ్స్ జల్లు కురిసింది. 69 ఏళ్ల చరిత్రలో రికార్డ్ క్రియేట్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు అల్లు అర్జున్. ఉత్తమ నటుడిగా 69ఏళ్లుగా ఒక్క టాలీవుడ్ హీరో కూడా జాతీయ అవార్డు అందుకోలేకపోయారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఆ రికార్డ్ ను క్రియేట్ చేశారు. తెలుగు సినిమాల్లో పుష్ప, కొండపోలం, ఆర్ఆర్ఆర్, ఉప్పెన సినిమాలకు అవార్డుల పంట పండింది. ఉత్తమ తెలుగు సినిమాగా ఉప్పెన సినిమా అవార్డు అందుకుంది. ఉత్తమ నటుడిగా పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్‌ అవార్డు అందుకున్నాడు. ఉత్తమ నటిగా గంగూబాయ్ కథియావాడి సినిమాకు అలియాభట్‌ అవార్డునను అందుకున్నారు. బెస్ట్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌: కింగ్ సోలోమన్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌), బెస్ట్‌ కొరియోగ్రఫర్‌గా ప్రేమ్‌రక్షిత్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌), బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ : ఎంఎం కీరవాణి, ప్లేబ్యాక్ సింగర్‌ : కాలభైరవ (ఆర్‌ఆర్‌ఆర్‌).

బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్‌ (ఆర్ఆర్‌ఆర్‌), బెస్ట్ పాపులర్ సినిమా (ఆర్‌ఆర్‌ఆర్‌), ఉత్తమ లిరిసిస్ట్ చంద్రబోస్‌(కొండపొలం), బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌: దేవీ శ్రీ ప్రసాద్‌ (పుష్ప), బెస్ట్‌ తెలుగు ఫిల్మ్‌ క్రిటిక్‌: పురుషోత్తమ చార్యులు అవార్డులు అందుకున్నారు. ఇదిలా ఉంటే ఈ జాతీయ అవార్డ్స్ పై నేచురల్ స్టార్ నాని హర్ట్ అయ్యాడు.

View this post on Instagram

A post shared by T-Series (@tseries.official)

సూర్య నటించిన జై భీమ్ సినిమాకు ఒక్క అవార్డు కూడా రాలేదు దాంతో నాని హర్ట్ అయ్యాడు. నాని మాత్రమే కాదు చాలా మంది జై భీమ్ సినిమాకు అవార్డు రాకపోవడంతో సోషల్ మీడియాలో చాలా మంది రకరకాల పోస్ట్ లు పెడుతున్నారు. యదార్ధ సంఘటన ఆధారంగా జై భీమ్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో కథ , సూర్య నటన సినిమాకే హైలైట్. నాని పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.Nani

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న జై భీమ్ యాష్ ట్యాగ్

ఇప్పటికే చాలా మంది జై భీమ్ సినిమాలోని సీన్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్