Naga Chaitanya, Sobhita: మోడీకి ధన్యవాదాలు తెలిపిన నాగచైతన్య, శోభిత జంట

|

Dec 30, 2024 | 11:36 AM

సినీ ప్రముఖులు, లెజెండ్రీ నటుల గురించి ప్రధాన మంత్రి మోడీ ప్రశంసలు కురిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది చివరి ‘మన్ కీ బాత్‌ కార్యక్రమంలో తెలుగు చలనచిత్ర దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుపై ప్రశంసల జల్లులు కురిపించారు. తెలుగు సినిమాకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. దాంతో తెలుగు వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Naga Chaitanya, Sobhita: మోడీకి ధన్యవాదాలు తెలిపిన నాగచైతన్య, శోభిత జంట
Naga Chaitanya And Sobhita
Follow us on

సినిమా ఇండస్ట్రీకి లెజెండ్రీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు చేసిన కృషిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు. తాజాగా ఆయన మన్ కీ బాత్‌లో అక్కినేని నాగేశ్వరరావు గురించి మాట్లాడారు మోడీ. తన సినిమాలలో భారతీయ సంప్రదాయాలు, విలువలకు తగిన స్థానం కల్పించి తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు మానవతా విలువలను కూడా ఆయన తన సినిమాల్లో చాటారని అన్నారు మోడీ. తెలుగు చిత్రపరిశ్రమకు ANR ఎంతో సేవ చేశారని.. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ  భారతీయ చలనచిత్ర రంగం వైపు చూస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అక్కినేనితో పాటు.. రాజ్ కపూర్, మహ్మద్ రఫీ, తపన్ సిన్హాల సేవలను మోదీ స్మరించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా మన సినిమాలు రికార్డులను సృష్టించడంతో పాటు అవార్డులు దక్కించుకుంటున్నాయని అన్నారు మోడీ.

అక్కినేని నాగేశ్వరావు మోడీ ప్రశంసించడంతో తెలుగు ప్రేక్షకులంతా సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కింగ్ నాగార్జున మోడీకి ధన్యవాదాలు తెలిపారు.” ఐకానిక్‌ లెజెండ్స్‌తోపాటు మా నాన్న ఏయన్నార్‌ గారిని ఆయన శత జయంతి సందర్భంగా మీరు గౌరవించడం ఆనందకరం” అని నాగార్జున అన్నారు. అలాగే నాగ చైతన్య , శోభిత కూడా మోడీకి ధన్యవాదాలు తెలిపారు.

అక్కినేని నాగేశ్వరరావు కళా నైపుణ్యాన్ని, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని మీరు అభినందించడం ఎంతో ఆనందంగా ఉంది. మీ నుంచి ప్రశంసలు పొందడం మా అదృష్టం. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని నాగచైతన్య, శోభిత తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేశారు. అలాగే మరికొంతమంది సినీ సెలబ్రెటీలు కూడా మోడీకి ధన్యవాదాలు తెలుపుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.