Bigg Boss Telugu 4 : బిగ్ బాస్..తెలుగులో కూడా ఈ రియాల్టీ షో సూపర్ సక్సెస్ అయ్యింది. మొదటి మూడు సీజన్లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అందుకే సీజన్ 4 కోసం బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటివరకు ఈ షోపై సందిగ్ధత నెలకొనగా, తాజా అప్ డేట్ తో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ 4 టీజర్ షూటింగ్ ప్రారంభించారు.
మూడో సీజన్ వ్యాఖ్యాతగా అదరగొట్టిన హీరో నాగార్జున.. ఈ సీజన్‌కూ హోస్ట్‌గా సందడి చేయనున్నారు. ఇందులో భాగంగా జరిగిన యాడ్ షూటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో ఈ షూటింగ్ జరిగింది. ‘సోగ్గాడే చిన్నినాయన’ ఫేమ్ కల్యాణ్‌కృష్ణ దర్శకత్వం వహించారు. సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ పనిచేశారు. త్వరలోనే ఈ టీజర్ రిలీజ్ చేయనున్నారు. మరోవైపు బిగ్ బాస్ సీజన్-4లో పాల్గొనే వారి లిస్ట్ కూడా రెడీ చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని ఫైనల్ చేసినట్టు సమాచారం. ఈ సీజన్‌లో పాల్గొనే వారికి ముందుగానే కొవిడ్-19 టెస్టులు చేసి, క్వారంటైన్‌కు తరలిస్తారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని కన్ఫామ్ అయిన తర్వాతే బిగ్ బాస్ హౌస్‌లోకి అనుమతిస్తారు. కరోనా కారణంగా ఈసారి బిగ్ బాస్‌ను జాగ్రత్తలు తీసుకుని నిర్వహిస్తున్నారు.
Read More : ప్రకాశం జిల్లా : శానిటైజర్ తాగి మృతిచెందిన వారిలో నలుగురికి కరోనా