టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ‘క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్’ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా బ్రేక్ అందుకున్నాడు.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు శౌర్య. ఆ తర్వాత ‘దిక్కులు చూడకు రామయ్య’ ‘ఓ బేబీ’ ‘ఛలో’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. రీసెంట్ గా కృష్ణ వ్రింద విహారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆసినిమా పేరు ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి.
ఈ సినిమాకు శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే నాగ శౌర్య వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ టైటిల్ చూస్తేనే ఇది ఫ్యామిలీ ఎంటర్టయినర్ జోనర్లో ఉంటుందని అర్ధమవుతోంది.
ఈ మూవీలో నాగశౌర్యకు జేడీగా మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ రోజు ఈ మూవీ టీజర్ ను రిలీజ్ సాయంత్రం6 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్రయూనిట్.