Samantha: చెరగని చైతన్య జ్ఞాపకం.. సమంత శరీరంపై మళ్లీ కనిపించిన టాటూ..

సామ్ స్టైలిష్ బ్లాక్ జాకెట్, జీన్స్ ధరించి మరింత స్టైలీష్ గా కనిపించింది. ఇక ఇదే డ్రెస్‏లో సమంత చేసిన ఫోటోషూట్స్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే సామ్ ఫోటోస్ నెట్టింట వైరల్ కాగా.. అందులో ఆమె శరీరంపై ఉన్న చైతన్య పేరు టాటూని నెటిజన్స్ గుర్తుపట్టేశారు. నాగచైతన్యతో విడాకుల తర్వాత సామ్ ఆ జ్ఞాపకాలన్నింటిని చెరిపేసినట్లుగా టాక్ వినిపించింది. ఇక ఇటీవల కొన్ని ఫోటోషూట్లలో సామ్ ఒంటిపై టాటూస్ కనిపించకపోవడంతో.. సామ్ చై గుర్తులను

Samantha: చెరగని చైతన్య జ్ఞాపకం.. సమంత శరీరంపై మళ్లీ కనిపించిన టాటూ..
Samantha

Updated on: Nov 04, 2023 | 9:37 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. కొద్ది నెలలుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా విదేశాల్లో చికిత్స తీసుకున్న సామ్.. ఇటీవలే హైదరాబాద్ తిరిగి వచ్చింది. శనివారం హైదరాబాద్‌లో మార్వెల్‌ రూపొందించిన ‘ది మార్వెల్స్‌’ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో సామ్ పాల్గొన్నారు. ఈ వేడుకలలో సామ్ స్టైలిష్ బ్లాక్ జాకెట్, జీన్స్ ధరించి మరింత స్టైలీష్ గా కనిపించింది. ఇక ఇదే డ్రెస్‏లో సమంత చేసిన ఫోటోషూట్స్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే సామ్ ఫోటోస్ నెట్టింట వైరల్ కాగా.. అందులో ఆమె శరీరంపై ఉన్న చైతన్య పేరు టాటూని నెటిజన్స్ గుర్తుపట్టేశారు. నాగచైతన్యతో విడాకుల తర్వాత సామ్ ఆ జ్ఞాపకాలన్నింటిని చెరిపేసినట్లుగా టాక్ వినిపించింది. ఇక ఇటీవల కొన్ని ఫోటోషూట్లలో సామ్ ఒంటిపై టాటూస్ కనిపించకపోవడంతో.. సామ్ చై గుర్తులను చెరిపేసిందంటూ ప్రచారం జరిగింది.

కానీ నిన్నటి ఫోటోషూట్లలో మాత్రం మరోసారి ఆ టాటూ తెరపైకి వచ్చింది. సమంత ఒంటిపై మళ్లీ ఆ టాటూ ప్రత్యేక్షమయ్యింది. దీంతో గతంలోని కొన్ని ఫోటోషూట్లలో కనిపించని టాటూ ఇప్పుడు మళ్లీ ఎలా వచ్చింది ? అంటూ చర్చ సాగుతోంది. ఈ విషయంపై సామ్ ఎలాంటి బదులివ్వలేదు. సమంత, చైతన్య ఇద్దరూ తమ ప్రేమకు గుర్తుగా పెళ్లి తేదీని టాటూలు వేయించుకున్న సంగతి తెలిసిందే. సమంత మెడ కింద భాగంలో YMC అని రాసి ఉంటుంది. మరొకటి బాణం గుర్తు టాటూ.. అలాగే రిబ్స్ పై చై అని ఉంటుంది. విడాకుల తర్వాత చైతన్య జ్ఞాపకాలు చెరిపేసిందని టాక్ నడించింది. కానీ ఇప్పుడు మళ్లీ కనిపించాయి.

చాలా కాలంపాటు ప్రేమలో ఉన్న సమంత, చైతన్య 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ నాలుగేళ్ల తర్వాత అంటే 2021 అక్టోబర్ లో ఈ జంట తమ విడిపోతున్నట్లు ప్రకటించారు. విడాకుల తర్వాత వరుస సినిమాలతో ఇద్దరూ బిజీ అయ్యారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.