
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. నిన్న తెల్లవారుజామున నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. విడుదలకు ముందే పాటలు, ట్రైలర్ ద్వారా అంచనాలు పెంచిన ఈ సినిమా.. విడుదలయ్యాక భారీ రెస్పాన్స్ అందుకుంది. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని మంచి వసూళ్లను తన ఖాతాలో వేసుకుంది. నటనపరంగా చైతన్య మరో మెట్టు పైకి ఎక్కాడు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా చేయగా.. చైతూ ఆమెతో పోటీపడి నటించాడు. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఇదిలా ఉంటే నాగ చైతన్య ఇటీవలే ఫుడ్ బిజినెస్ మొదలు పెట్టాడు. షోయు అనే పేరుతో ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టాడు. అది సక్సెస్ ఫుల్ గా నడుస్తుండటంతో ఇటీవలే ‘స్కూజీ’ పేరుతో మరో కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫుడ్ బిజినెస్ గురించి మాట్లాడాడు. కస్టమర్లకు మంచి టేస్టీ ఫుడ్ అందించడమే తమ టార్గెట్ అని నాగ చైతన్య అన్నారు. అలాగే ఇటీవల మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా నాగ్ చైతన్య రెస్టారెంట్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. దేవర సినిమాను జపాన్ లో ప్రమోట్ చేసే భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హైదరాబాద్ లో షోయు అనే రెస్టారెంట్ ను రికమెండ్ చేస్తాను. మై డియర్ ఫ్రెండ్, నా కో-యాక్టర్ నాగచైతన్య ఆ రెస్టారెంట్ ఓనర్. ఇండియాలోనే బెస్ట్ జపనీస్ ఫుడ్ అక్కడ దొరుకుతుంది. అక్కడ ఫుడ్ అద్భుతంగా ఉంటుంది అని ఎన్టీఆర్ అన్నారు.
దీని పై నాగచైతన్య మాట్లాడుతూ.. తారక్ అలా చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. దేవర సినిమాని ప్రమోట్ చేసేప్పుడు జపనీస్ తో మన ఇండియన్ సుషీ గురించి మాట్లాడారు. ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అని నాగచైతన్య అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక నాగ చైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మైథలాజికల్ థ్రిల్లర్ గా ఉండనుంది. ఇప్పటికే విడుదలైన ప్రీలుక్ పోస్టర్ ఆకట్టుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.