Naga Chaitanya, Sobhita: నాగ్ చైతన్య, శోభిత పెళ్లి అక్కడే.. వారం రోజుల పెళ్లి సందడి..?

| Edited By: Ravi Kiran

Aug 22, 2024 | 12:17 PM

నిశ్చితార్థం తర్వాత వీరిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగ్ చైతన్య గతంలో హీరోయిన్ సమంత రూత్ ప్రభుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లయిన నాలుగేళ్లకే ఇద్దరూ విడిపోయారు. అక్టోబర్ 2021లో, సమంత, నాగ్ చైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు.

Naga Chaitanya, Sobhita: నాగ్ చైతన్య, శోభిత పెళ్లి అక్కడే.. వారం రోజుల పెళ్లి సందడి..?
Naga Chaitanya, Shobitha
Follow us on

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, యంగ్ హీరోయిన్ శోభితతో ప్రేమాలో ఉన్నాడు. ఇటీవలే ఈ జంట ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. నాగ్ చైతన్య గర్ల్ ఫ్రెండ్ శోభితా ధూళిపాళతో ఆగస్ట్ 8న నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థం తర్వాత వీరిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగ్ చైతన్య గతంలో హీరోయిన్ సమంత రూత్ ప్రభుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లయిన నాలుగేళ్లకే ఇద్దరూ విడిపోయారు. అక్టోబర్ 2021లో, సమంత, నాగ్ చైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఆ తర్వాత నాగ్ చైతన్య నటి శోభితతో డేటింగ్ చేశాడు. ఇప్పుడు మన దేశంలోనే అట్టహాసంగా శోభితను పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : Vishwambhara: బంపర్ ఆఫర్ అందుకున్న యంగ్ హీరోయిన్.. మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా ఈ హాట్ బ్యూటీ..

శోభిత్, నాగ్ చైతన్య అతి త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఈ ఇద్దరూ త్వరలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని తెలుస్తోంది. రాజస్థాన్‌లో వీరి వివాహం వచ్చే సంవత్సరం మార్చిలో జరగనుందని తెలుస్తోంది. వారం రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు, పెళ్లి వేడుకలు జరగనున్నాయని టాక్. గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ తర్వాత, నాగ్ చైతన్య, శోభిత హైదరాబాద్‌లో తమ స్నేహితుల కోసం రిసెప్షన్ పార్టీని ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు కుటుంబం నుంచి కానీ,ఈ ఇద్దరి నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.

ఇది కూడా చదవండి : Rakul Preet Singh: ఊహించని పరిణామాలు నా జీవితంలో జరుగుతున్నాయి.. ఎమోషనల్ అయిన రకుల్

కొడుకు నిశ్చితార్థం తర్వాత నాగార్జున స్పందించారు.“శోభిత, నాగచైతన్య త్వరలోనే వివాహం చేసుకుంటారు.. మేము హడావిడిగా లేము. ఆ రోజు చాలా పవిత్రమైనది కాబట్టి మేము దీని కోసం తొందరపడటంలేదు.. చై ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు” అని అన్నారు నాగ్.  చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంతతో సంబంధంలో ఏమైనా చెడిందా అనే ప్రశ్నకు.. నాగ్ సమాధానం ఇస్తూ.. సమంత ఎప్పుడూ కోడలులా కాకుండా తనకు కూతురిలా ఉండేదని, అలాగే కొనసాగుతుందని అన్నారు. “మా సంబంధం ఎప్పటికీ మారదు. వారి సంబంధంలో ఏమి జరిగింది అనేది పూర్తిగా వేరే కథ. కానీ నాకు మాత్రం సమంత ఎప్పుడూ నా కూతురిలానే ఉంటుంది’’ అని అన్నారు నాగ్.

ఇది కూడా చదవండి : అప్పుడు రవితేజ లవర్‌గా.. ఇప్పుడు మిస్టర్ బచ్చన్‌లో ఇలా..! ఈ హీరోయిన్ ఎంత మారిపోయింది..!!

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..