Virupaksha: విరూపాక్ష నుంచి ఫస్ట్ లిరికల్.. ఆకట్టుకుంటున్న మెలోడీ

టైటిల్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ అంచనాలు పెరిగాయి. కార్తీక్‌ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తేజ్‌కు జోడిగా సంయుక్త మీనన్‌ నటిస్తోంది. బ్లాక్‌ మ్యాజిక్‌ వంటి ఇంట్రెస్టింగ్‌ కథాంశంతో ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు.

Virupaksha: విరూపాక్ష నుంచి ఫస్ట్ లిరికల్.. ఆకట్టుకుంటున్న మెలోడీ
Virupaksha

Updated on: Mar 24, 2023 | 7:32 PM

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ విరూపాక్ష. చిత్రలహరి సినిమా తర్వాత మరో హిట్ అందుకోలేదు తేజ్. రిపబ్లిక్ మూవీ సమయంలో రోడ్డు ప్రమాదం జరగడంతో కొంతకాలం గ్యాప్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు విరూపాక్ష అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు తేజ్. టైటిల్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ అంచనాలు పెరిగాయి. కార్తీక్‌ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తేజ్‌కు జోడిగా సంయుక్త మీనన్‌ నటిస్తోంది. బ్లాక్‌ మ్యాజిక్‌ వంటి ఇంట్రెస్టింగ్‌ కథాంశంతో ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు.

సినిమా కథ ఏంటన్నదానిపై అందరిలో క్యూరియాసిటీ పెంచేసిందీ మూవీ. ఇదిలా ఉంటే పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 21న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో కూడా విడుదల చేయనున్నారు.

ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమానుంచి ఫస్ట్ సాంగ్  విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఇద్దరి మధ్య వచ్చే ఓ రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ చాలా వినాసోపుగా ఉంది.