RRR Movie: ఇంట్రెస్టింగ్ పోస్టర్‏తో అప్డేట్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ టీం.. స్టెప్పులతో అదరగొడుతున్న తారక్.. చరణ్ ..

ధర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

RRR Movie: ఇంట్రెస్టింగ్ పోస్టర్‏తో అప్డేట్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ టీం.. స్టెప్పులతో అదరగొడుతున్న తారక్.. చరణ్ ..
Rrr Movie

Edited By: Anil kumar poka

Updated on: Nov 06, 2021 | 12:43 PM

ధర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన ప్రాత్రలలో నటిస్తుండడంతో ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‏తో డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్.. పెన్ స్టూడియోస్.. లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. హాలీవుడ్ భామా.. ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతేకాకుండా.. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ అంచనాలను మరింత పెంచేశాయి.

ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఈ నేపథ్యంలో చిత్రప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇక దీపావళి కానుకగా ఇప్పటికే ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఆర్ఆర్ఆర్ సినిమాలోని సెకండ్ సింగిల్ సాంగ్‏ను నవంబర్ 10న రిలీజ్ చేయబోతున్నట్లుగా ప్రకటించింది. నాటు నాటు అంటూ సాగే పాటను బ్లాస్టింగ్ బీట్స్, హైవోల్జేజ్ డ్యాన్స్ నంబర్ అని మేకర్స్ తెలిపారు. ఈ పాటకు ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు. తెలుగుతోపాటు.. తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సాంగ్ రిలీజ్ చేయనున్నారు. ఈసందర్భంగా ఆర్ఆర్ఆర్ హీరోలకు సంబంధించిన ఓ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో చెర్రీ, తారక్ మాస్ స్టెప్పులు వేస్తూ కనిపిస్తున్నారు. 1920కు తగ్గట్టుగా డ్రెస్సింగ్ స్టైల్ ఆకట్టుకుంటుంది. ఇందులో చరణ్.. అల్లూరి సీతరామరాజుగా.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. సముద్రఖని, శ్రియా ఇందులో కీలక పాత్రలలో కనిపించనున్నారు.

Also Read: Rashi Khanna: రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న ముద్దమందారం… చూస్తే వావ్ అనాల్సిందే…

Sai Dharam Tej: ప్రమాదం తర్వాత తొలిసారి కెమెరా ముందు సాయి ధరమ్ తేజ్.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన మెగాస్టార్..