Tollywood: ‘ఆడిషన్‌కు పిలిచి తర్వాత అవసరం లేదన్నారు.. నన్ను సినిమా నుంచి తీసేశారనుకున్నా..’

టాలీవుడ్‌లో తన తొలి ఆడిషన్ అనుభవాన్ని గతంలో ఓ ప్రెస్ మీట్‌లో పంచుకుంది హీరోయిన్ అనశ్వర రాజన్. 'ఛాంపియన్' సినిమా కోసం 2024 ఏప్రిల్‌లో ప్రొడక్షన్ నుంచి కాల్ వచ్చిందని.. ఆ తర్వాత జరిగిందిదేనని తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Tollywood: ఆడిషన్‌కు పిలిచి తర్వాత అవసరం లేదన్నారు.. నన్ను సినిమా నుంచి తీసేశారనుకున్నా..
Anaswara Rajan

Updated on: Jan 22, 2026 | 9:20 AM

టాలీవుడ్‌లో మొదటిసారి ఆడిషన్ చేసిన అనుభవాన్ని పంచుకుంది హీరోయిన్ అనశ్వర రాజన్. గతంలో ఇచ్చిన ‘ఛాంపియన్’ మీట్‌లో ఆమె ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మూవీ కోసం తనకు 2024 ఏప్రిల్‌లో ప్రొడక్షన్ నుంచి కాల్ వచ్చిందని చెప్పింది. ఆ తర్వాత లుక్ టెస్ట్ జరిగింది. హాఫ్ శారీ వేసుకుని టెస్టుకు అటెండ్ అయ్యానని తెలిపింది. నిర్మాత సాయి, కో-డైరెక్టర్ తనకు రిహార్సల్స్ కోసం ఒక స్క్రిప్ట్ ఇచ్చి డైలాగ్స్ నేర్చుకోమని అడిగారు. తెలుగు రాదని చెప్పగా, “పర్లేదు, ఇంగ్లీష్‌లోనే చెప్పండి” అన్నారు. డైరెక్టర్ ప్రదీప్ అక్కడే ఉండగా, నేను డైలాగ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నాను.

ఇది చదవండి: ‘ఆ సాంగ్ వల్లే హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!’

ఇవి కూడా చదవండి

ఆ సమయంలో స్వప్న దత్ వచ్చి, నన్ను చూసి ‘ఓకే’ అని వెళ్లిపోయారు. ఆ వెంటనే డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం, నిర్మాత సాయి మిగిలినవారందరూ వెళ్లిపోయారు. కొన్ని నిమిషాల తర్వాత సాయి మళ్ళీ వచ్చి, “పర్లేదు, ఆడిషన్ అవసరం లేదు, ఇది చేయనవసరం లేదు” అన్నారు. “ఏమైంది?” అని అడగగా, ఆయన “లేదు లేదు, పర్లేదు, దానివల్ల ఉపయోగం లేదు” అని బదులిచ్చారు. “ఏమైంది?” అని నేను మళ్ళీ అడిగాను.

ఇది చదవండి: టైమ్ చూసి చావుదెబ్బ కొట్టారు కదా భయ్యా.! ఇక టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు..

ఆ సమయంలో నేను వాళ్ళకి నచ్చలేదేమో, క్యాన్సిల్ అయ్యిందేమో, ఇక అవసరం లేదని, వెళ్లిపోవచ్చని అనుకున్నాను. నిర్మాత సాయి మాత్రం “లేదు లేదు, ఉపయోగం లేదు, పర్లేదు, ఫైన్” అని చెప్పుకొచ్చారు. “ఈ సినిమా నుంచి పీకేశారు అనుకున్నా” అలా మొదటి ఆడిషన్ విఫలమైందని నిరాశ చెందాను. కానీ అనూహ్యంగా తాను సెలెక్ట్ అయ్యానని తెలుసుకుని సంతోషించానని హీరోయిన్ అనశ్వర రాజన్ తెలిపింది. కాగా, ఇటీవల విడుదలైన ‘ఛాంపియన్’ మూవీ మంచి టాక్‌తో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.

ఇది చదవండి: షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏమన్నారంటే.?

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..