Music School: షూటింగ్ పూర్తిచేసుకున్న మ్యూజిక్ స్కూల్.. విడుదల ఎప్పుడంటే..

|

Jun 07, 2022 | 6:26 AM

తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ సినిమా ప్రారంభం నుంచి అంచ‌నాలు ఎక్కువగానే ఉన్నాయి.. ఇప్పటివరకు హైద‌రాబాద్‌, గోవా స‌హా ప‌లు

Music School: షూటింగ్ పూర్తిచేసుకున్న మ్యూజిక్ స్కూల్.. విడుదల ఎప్పుడంటే..
Music Shool
Follow us on

హీరోయిన్ శ్రియా శరన్.. శర్మన్ జోషి జంటగా నటిస్తోన్న చిత్రం మ్యూజిక్ స్కూల్. ఈ సినిమాకు లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళ‌య రాజా సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ సినిమా ప్రారంభం నుంచి అంచ‌నాలు ఎక్కువగానే ఉన్నాయి.. ఇప్పటివరకు హైద‌రాబాద్‌, గోవా స‌హా ప‌లు ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రిపారు. తాజాగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన షెడ్యూల్‌తో చిత్రీక‌ర‌ణ పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.. ఈ సినిమాలో మొత్తం 11 పాటలున్నాయి. అందులో కేవ‌లం మూడు పాట‌లు కేవ‌లం మ్యూజిక్‌తోనే సాగుతాయి.

ఈ సంద‌ర్భంగా సినిమాటోగ్రాఫ‌ర్ కిర‌ణ్ డియోహ‌న్స్ మాట్లాడుతూ ‘‘సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. సినిమా షూటింగ్ స‌మ‌యం ఎంతో స‌ర‌దాగా సాగింది. డైరెక్ట‌ర్ పాపారావుగారితో చేసిన జ‌ర్నీని ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. యామిని ఫిలింస్ స‌హా ఎంటైర్ టీమ్‌ను ఎంతో మిస్ అవుతాను. యూనిట్‌కు గుడ్ బై చెప్ప‌డానికి మ‌న‌సు ఒప్ప‌టం లేదు’’ అన్నారు.

శ్రియా శరన్ మాట్లాడుతూ ‘‘‘మ్యూజిక్ స్కూల్’ ఓ అద్భుత‌మైన స్క్రిప్ట్‌. త‌ల్లిగా మారిన త‌ర్వాత ఈ సినిమాలో న‌టించ‌డానికి అంగీక‌రించాను. కాబ‌ట్టి ఈ సినిమా నాకెంతో ప్ర‌త్యేక‌మైనది. నేను చిన్న పాప‌గా ఉన్న‌ప్ప‌టి నుంచి ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ వింటూ పెరిగాను. ఇప్పుడు వాటిలో కొన్నింటికి మ్యూజిక్ స్కూల్‌లో న‌టించ‌టం అనేది గొప్ప వ‌రంగా భావిస్తున్నాను. అద్భుత‌మైన న‌టీన‌టులు, చిన్న పిల్ల‌లు, టెక్నిక‌ల్ టీమ్‌తో కలిసి ఈ సినిమా కోసం ప‌ని చేశాను. శ‌ర్మ‌న్ జోషిగారికి ప్ర‌త్యేక‌మైన కృత‌జ్ఞ‌త‌లు. ఆయ‌న ఎప్పుడూ నేను న‌వ్వుతూ ఉండేలా చూసుకున్నారు. అలాగే యామిని రావుగారికి ధ‌న్య‌వాదాలు. మా యూనిట్‌కు ఏది అవ‌స‌ర‌మో దాన్ని స‌మ‌యానికి ఏర్పాటు చేయ‌టంలో వారు ఎంతో స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చారు. ఓ గొప్ప పాత్ర‌ను క్రియేట్ చేసి అందులో న‌న్ను న‌టింప చేసినందుకు ద‌ర్శ‌కులు పాపారావుగారికి ధ‌న్యవాదాలు. ఆయ‌న తొలి సినిమా ఇది. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న విజ‌న్ ఎంతో గొప్ప‌గా ఉంది. నా క‌ల‌ను నిజం చేసిన కిర‌ణ్‌గారికి థాంక్స్‌. ఈ సినిమా నాకెప్ప‌టికీ గుర్తుండిపోయే సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నాను అన్నారు.