Thaman : అందుకే ప్రభాస్ సినిమాకు మ్యూజిక్ చేయలేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన తమన్..

|

Nov 26, 2021 | 4:32 PM

ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్. చిన్న పెద్ద అనే తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు తమన్.

Thaman : అందుకే ప్రభాస్ సినిమాకు మ్యూజిక్ చేయలేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన తమన్..
Prabhas
Follow us on

Thaman : ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్. చిన్న పెద్ద అనే తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు తమన్. కరోనా తర్వాత ఈ యంగ్ మ్యూజిక్ డైనమేట్ స్పీడ్ పెంచారు. ఇప్పుడు తమన్ చేతిలో దాదాపు 10కి పైగా సినిమాలు ఉన్నాయి. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో తమన్ పనిచేశారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, బాలకృష్ణ, చిరజీవి వంటి స్టార్ హీరోల సినిమాకు పనిచేస్తున్నారు. మహేష్ బాబుతో సర్కారు వారి పాట, పవన్‌తో భీమ్లానాయక్, బాలయ్యతో అఖండ, చిరంజీవితో గాడ్ ఫాదర్, రామ్ చరణ్- శంకర్ సినిమాకు మ్యూజిక్ చేస్తున్నాడు తమన్. ఇలా వరుస సినిమాలను చేస్తూనే.. త్వరలో పట్టాలెక్కబోతున్న సినిమాలకు కూడా రెడీ అవుతున్నాడు తమన్. అలాగే తమిళ్ సినిమాలకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు అందరు హీరోలతో పని చేసిన తమన్ ఎందుకు ప్రభాస్ సినిమాకు మ్యూజిక్ అందించలేక పోయాడు అనే ప్రశ్న ఎదురైంది. దానికి తమన్ మాట్లాడుతూ.. ప్రభాస్ నటించిన రెబల్ సినిమాకు మ్యూజిక్ చేసే ఛాన్స్ వచ్చింది కానీ తానే సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తా అని లారెన్స్ చెప్పడంతో ఆ సినిమానుంచి తప్పుకున్నా.. ఆతర్వాత ఆయనతో కలిసి పనిచేసే ఛాన్స్ రాలేదు. ఫ్యూచర్ లో ప్రభాస్ సినిమాకు మ్యూజిక్ అందిస్తా అని తమన్ అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Keerthy Suresh: చీరకట్టులో మెరిసిపోతున్న నేటి ‘మహానటి’.. ‘కీర్తీసురేష్’ లేటెస్ట్ ఫోటోస్..

Ritu Varma: తెలుగు అమ్మాయి రీతూ వర్మ అందాలు.. చందమామ అయినా చిన్నబోవాల్సిందే..(ఫొటోస్)

Nivetha Pethuraj: న్యూ ఫోటోస్ తో ఆకట్టుకుంటున్న నివేత పేతురాజ్.. వరుస సినిమాలతో బిజీగా ముద్దుగుమ్మ..