Varisu Movie: విజయ్ వరిసు చిత్రానికి భారీ రెస్పాన్స్.. థియేటర్లోనే కన్నీళ్లు పెట్టుకున్న థమన్.. డైరెక్టర్ వంశీ పైడిపల్లి..

|

Jan 11, 2023 | 5:31 PM

సంక్రాంతి కానుకగా ఈ సినిమా తమిళ్ వెర్షన్ ఈరోజు (జనవరి 11న) తమిళనాడులో విడుదలైంది. ఉదయం నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ విజయ్ ఫ్యాన్స్ నెట్టింట పండగ చేసుకుంటున్నారు.

Varisu Movie: విజయ్ వరిసు చిత్రానికి భారీ రెస్పాన్స్.. థియేటర్లోనే కన్నీళ్లు పెట్టుకున్న థమన్.. డైరెక్టర్ వంశీ పైడిపల్లి..
Varisu Movie
Follow us on

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి నేరుగా తెలుగులో నటించిన చిత్రం వారసుడు. ఈ సినిమాను తమిళంలో వరిసు టైటిల్‏తో తీసుకువచ్చారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా తమిళ్ వెర్షన్ ఈరోజు (జనవరి 11న) తమిళనాడులో విడుదలైంది. ఉదయం నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ విజయ్ ఫ్యాన్స్ నెట్టింట పండగ చేసుకుంటున్నారు. ఇక థియేటర్ల వద్ద దళపతి ఫ్యాన్స్ చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. విజయ్ కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని వరిసు చిత్రయూనిట్ డైరెక్టర్ వంశీపైడిపల్లి, దిల్ రాజు, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రాన్ని వీక్షించారు.

చెన్నైలో అభిమానులతో కలిసి చిత్రయూనిట్ తోపాటు.. వంశీ పైడిపల్లి, థమన్.. దిల్ రాజు.. నటుడు శ్యామ్ వరిసు చిత్రాన్ని వీక్షించారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ ఉత్సాహం.. అభిమానం.. వరిసు చిత్రానికి అభిమాను నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి థియేటర్లలో భావోద్వేగానికి గురయ్యారు థమన్.. డైరెక్టర్ వంశీ పైడిపల్లి. వీరిద్దరిని ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇక వరిసు తెలుగు వెర్షన్ జనవరి 14న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ చిత్రాన్ని జనవరి 11న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ.. ఆ తర్వాత తెలుగు హీరోలకు థియేటర్లు కావాలని.. తాను వెనక్కు తగ్గినట్లు చెప్పారు దిల్ రాజు. దీంతో వారసుడు తెలుగు వెర్షన్ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.