2500 మంది కళాకారులతో కీరవాణి ప్రదర్శన.. ఆస్కార్ విజేతకు మరో అరుదైన అవకాశం

ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా కీరవాణి పేరు మారుమోగింది. ఈ చిత్రానికి ఆయన అందించిన మ్యూజిక్ శ్రోతలను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆయన అందించిన మాస్ మ్యూజిక్‏కు ప్రపంచమంతా స్టెప్పులేసింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ వేదికపై కీరవాణి అందించిన మాస్ బీట్‏కు హాలీవుడ్ యాక్టర్స్ సైతం కాలు కదిపారు

2500 మంది కళాకారులతో కీరవాణి ప్రదర్శన.. ఆస్కార్ విజేతకు మరో అరుదైన అవకాశం
Mm Keeravani

Updated on: Jan 19, 2026 | 4:31 PM

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కర్ విజేత కీరవాణి మరో అరుదైన అవకాశాన్ని అనుకున్నారు. జాతీయ గీతం అయిన వందేమాతరం ఈ ఏడాదితో 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈమేరకు హైదరాబాద్ లో కీరవాణి తన టీమ్ తో కలిసి ఓ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ విషయాన్నీ ఆయనే సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. ఈమేరకు కీరవాణి ఎక్స్(ట్విట్టర్ ) ఖాతాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. ఆ అద్భుత ప్రదర్శన జనవరి 26న రిపబ్లిక్ డే రోజున జరగనుంది. జాతీయ గీతం అయిన వందేమాతరం ఈ ఏడాదితో 150 సంవత్సరాలు పూర్తి చేసుకోనుండటంతోదాని పై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో 150 సంవత్సరాల వందేమాతరంపై కీరవాణి పరేడ్ కి ప్రత్యేకమైన మ్యూజిక్ ను అందించబోతున్నారు. ఇక  డియర్ ఆల్, వందేమాతరం! ఐకానిక్ పాట వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనవరి 26వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు సంగీతం అందించడం నాకు చాలా గౌరవంగా అలాగే అదృష్టంగా భావిస్తున్నాను.

ఈ గొప్ప ప్రదర్శనను భారతదేశం అంతటా 2,500 మంది కళాకారులు ప్రదర్శిస్తారు. మన దేశం యొక్క స్ఫూర్తిని జరుపుకోవడానికి మనం కలిసి వచ్చినప్పుడు వేచి ఉండండి అంటూ కీరవాణి రాసుకొచ్చారు. ఈ ప్రదర్శనలో 2500 మంది కళాకారులు పాల్గొననుండటంతో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. 1887లో బంకిం చంద్ర ఛటర్జీ స్వరపరిచిన మన జాతీయ గీతం ఈ ఏడాదితో 150 వసంతాలు పూర్తి చేసుకుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..