సినీ ఇండస్ట్రీలో విషాదం.. కీరవాణి తండ్రి, ప్రముఖ సినీ రచయిత శివశక్తి దత్త కన్నుమూత..

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇంట్లో విషాదం చొటు చేసుకుంది. కీరవాణి తండ్రి శివశక్తి దత్త కన్నుమూశారు. శివశక్తి దత్త (92) కన్నుమూశారు. ఆయన తెలుగు సినిమా రంగంలో రచయితగా, దర్శకుడిగా గుర్తింపు పొందారు. శివశక్తి దత్త అసలు పేరు కోడూరు సుబ్బారావు..

సినీ ఇండస్ట్రీలో విషాదం.. కీరవాణి తండ్రి, ప్రముఖ సినీ రచయిత శివశక్తి దత్త కన్నుమూత..
Keeravani

Updated on: Jul 08, 2025 | 8:46 AM

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇంట్లో విషాదం చొటు చేసుకుంది. కీరవాణి తండ్రి శివశక్తి దత్త కన్నుమూశారు. శివశక్తి దత్త (92) కన్నుమూశారు. ఆయన తెలుగు సినిమా రంగంలో రచయితగా, దర్శకుడిగా గుర్తింపు పొందారు. శివశక్తి దత్త అసలు పేరు కోడూరు సుబ్బారావు.. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీలో, కీరవాణి కుటుంబంలో విషాదం నెలకొంది. శివశక్తి దత్త సోమవారం అర్ధరాత్రి కన్నుమూశారు. తెలుగు సినిమాల్లో సంస్కృత ఆధారిత పాటలు రాయడంలో ప్రత్యేక గుర్తింపు పొందారు శివశక్తి దత్త .

శివశక్తి దత్త చిన్న వయస్సు నుంచి కళలపై మక్కువ చూపారు. ఏలూరు సి.ఆర్. రెడ్డి కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతూ మధ్యలో చదువు మానేసి, ముంబైలోని సర్ జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో చేరారు. అక్కడ డిప్లొమా పొంది, కొవ్వూరు తిరిగి వచ్చారు. కమలేష్ అనే కలం పేరుతో రచనలు చేసేవారు. సంగీతంపై ఆసక్తితో గిటార్, సితార్, హార్మోనియం వాయించడం నేర్చుకున్నారు. సినిమా రంగంపై ఆసక్తితో చెన్నైకి వెళ్లి, అక్కడ స్థిరపడ్డారు.

శివ శక్తి దత్త దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మామ, రచయిత వి. విజయేంద్ర ప్రసాద్ సోదరుడు. రాజమౌళి దర్శకత్వం వహించిన సై , ఛత్రపతి, బాహుబలి, రాజన్న, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాటు హనుమాన్ సినిమాకు కూడా ఆయన పాటలు రాశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..