జైలర్.. ఇప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న చిత్రం. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. తమిళనాడుతోపాటు.. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా వసూళ్లు రాబడుతుంది ఈ సినిమా. మరోవైపు ఈ చిత్రంలోని సాంగ్స్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పటికే కావాలా, హుకుం సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాకు ముందుగా రజిని హైలెట్ కాగా.. ఆ తర్వాత ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించింది మ్యూజిక్. ఇప్పుడు ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన అనిరుధ్ రవిచందర్ గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. జైలర్ సినిమా కోసం అనిరుధ్ ఎక్కువగానే రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్ నడుస్తోంది.
ఆగస్ట్ 10న విడుదలైన జైలర్ చిత్రాం భారీగా వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. ఈ సినిమాలో మెయిన్ హైలెట్ అంటే బ్యాగ్రౌండ్ మ్యూజిక్. అనిరుధ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇక కావాలా, హుకుమ్ పాట గురించి చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమా కోసం రజిని తర్వాత అనిరుధ్ ఎక్కువ తీసుకున్నారట.
అనిరుధ్ రవిచందర్ ఇన్ స్టా పోస్ట్..
ఈ సినిమాకు రజినీకి రూ.110 కోట్ల పారితోషికం తీసుకోగా.. అనిరుధ్ కు ఏకంగా రూ.10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొన్నటివరకు రూ. 8 కోట్లు మాత్రమే తీసుకున్న అనిరుధ్.. ఇప్పుడు జైలర్ సినిమాతో ఏఆర్ రెహామాన్ ను దాటేశారు. ఇక ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోలందరి చిత్రాలకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
అనిరుధ్ రవిచందర్ ఇన్ స్టా పోస్ట్..
ఇప్పుడే కాదు.. గతంలోనూ అనిరుధ్ అందించిన సంగీతం ఆయా సినిమాలకు స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. ప్రస్తుతం ఈ మ్యూజిక్ డైరెక్టర్ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక మరికొన్ని సినిమాలకు అనిరుధ్ రూ. 10 కోట్ల కంటే ఎక్కువే తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న దేవర చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. తన సంగీతం.. బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమాకు హైలెట్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు అనిరుధ్
అనిరుధ్ రవిచందర్ ఇన్ స్టా పోస్ట్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.