Mrunal Thakur: ఫర్‌‌ఫెక్ట్‌ ఫిట్‌నెస్, గ్లోయింగ్ లుక్.. బ్యూటీ సీక్రెట్‌ రివీల్ చేసిన సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్

టాలీవుడ్‌లో అతి తక్కువ సమయంలోనే తన నటనతో, కళ్లతో మంత్రముగ్ధులను చేసిన నటి ఆమె. 'సీతారామం' సినిమాలో సాంప్రదాయబద్ధమైన సీతగా ఎంత మెప్పించిందో, సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోలతో అంతే సెన్సేషన్ క్రియేట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది ఈ భామ.

Mrunal Thakur: ఫర్‌‌ఫెక్ట్‌ ఫిట్‌నెస్, గ్లోయింగ్ లుక్.. బ్యూటీ సీక్రెట్‌ రివీల్ చేసిన సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్
Mrunal Thakur.

Updated on: Jan 22, 2026 | 7:00 AM

ముఖంపై ఎప్పుడూ కనిపించే ఆ సహజమైన కాంతి (గ్లో), ఎంతో ఫిట్‌గా ఉండే ఆమె శరీరాకృతి చూసి అభిమానులు తరచుగా ఒకటే అడుగుతుంటారు.. “మీ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటి?” అని. సాధారణంగా హీరోయిన్లు అంటే కఠినమైన డైట్ పాటిస్తారని, అసలు స్వీట్లు ముట్టుకోరని మనం అనుకుంటాం. కానీ ఈ భామ మాత్రం తనకు పిజ్జాలన్నా, మిఠాయిలన్నా చాలా ఇష్టమని చెబుతోంది. మరి అవన్నీ తింటూనే ఆమె అంత ఫిట్‌గా ఎలా ఉంటోంది?

క్లీన్ అండ్ బ్యాలెన్స్‌డ్ డైట్..

ప్రస్తుతం ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ తో బిజీగా ఉన్న మృణాల్ ఠాకూర్, తన ఆహారపు అలవాట్ల విషయంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఆమె ప్రధానంగా ‘క్లీన్ డైట్’ను నమ్ముతుంది. అంటే ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండటం. జంక్ ఫుడ్, సోడా వంటి చక్కెర పానీయాలు, నూనెలో వేయించిన స్నాక్స్‌ను ఆమె అస్సలు ముట్టుకోదు. మన శరీరంలోకి వెళ్లే ప్రతి పదార్థం మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఆమె అభిప్రాయం.

ఫిట్‌నెస్ సీక్రెట్​..

కేవలం ఆహారం మాత్రమే కాదు, వ్యాయామం విషయంలో కూడా మృణాల్ అస్సలు రాజీ పడదు. ఆమె ఆరోగ్య రహస్యాల్లో అతి ముఖ్యమైనది నీరు. రోజంతా తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకుంటుంది. దీనివల్ల చర్మం కాంతివంతంగా ఉండటమే కాకుండా మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. షూటింగ్ షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నా సరే, వర్కవుట్ చేయడానికి ఆమె సమయాన్ని కేటాయిస్తుంది. వ్యాయామం అనేది కేవలం శరీరం కోసమే కాదు, మానసిక ప్రశాంతతకు కూడా అవసరమని ఆమె నమ్ముతుంది.

పిండి పదార్థాల విషయంలో మృణాల్ చాలా జాగ్రత్తగా ఉంటుంది. వైట్ రైస్, పంచదార, మైదాతో చేసిన బ్రెడ్ వంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లను ఆమె చాలా వరకు పరిమితం చేస్తుంది. అయితే, తనకు ఇష్టమైన పిజ్జాలు లేదా స్వీట్లను పూర్తిగా మానేయదు. ఇక్కడే ఆమె ఒక సూత్రాన్ని పాటిస్తుంది.. అదే మితంగా తినడం. ఏదైనా తిన్నప్పుడు అతిగా తినకుండా, తక్కువ పరిమాణంలో తింటూ తన కోరికను తీర్చుకుంటుంది.

చాలామంది హీరోయిన్లు కేవలం జిమ్‌కే పరిమితం అవుతారు. కానీ ‘జెర్సీ’ నటి మాత్రం విభిన్నమైన వ్యాయామాలను ఇష్టపడుతుంది. రన్నింగ్, స్విమ్మింగ్‌తో పాటు టీఆర్ఎక్స్ (TRX) మరియు ఎంఎంఏ (MMA) వంటి కఠినమైన యుద్ధ విద్యలను కూడా ఆమె ప్రాక్టీస్ చేస్తుంది. దీనివల్ల ఆమె శరీరం ఎంతో దృఢంగా మారుతుంది. మృణాల్ ఠాకూర్ ఫిట్‌నెస్ ప్రయాణం చూస్తే మనకు ఒకటి అర్థమవుతుంది.. అందంగా కనిపించడం అంటే కేవలం మేకప్ వేసుకోవడం కాదు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవడం. సరైన ఆహారం, నిరంతర వ్యాయామం ఉంటే ఎవరైనా మెరిసిపోవచ్చు.