AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలాంటివి చేయడానికి నేను భయపడ్తాను.. చాలా ఆఫర్స్ మిస్ చేసుకున్నా.. స్టార్ హీరోయిన్ కామెంట్స్

ఇంటిమేట్ సీన్స్ లో నటించడానికి ఇప్పుడున్న హీరోయిన్స్ చాలా మంది వెనకాడటం లేదు. ఎలాంటి పాత్ర అయినా సరే చేసేస్తున్నారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం.. ఇంటిమేట్ సీన్స్ అంటే చాలు వెనకడుగేస్తున్నారు. ఈ హీరోయిన్ కూడా కెరీర్ బిగినింగ్ లో ఇంటిమేట్ సీన్స్ లో నటించాడని పేరెంట్స్ ఒప్పుకోలేదని తెలిపింది..

అలాంటివి చేయడానికి నేను భయపడ్తాను.. చాలా ఆఫర్స్ మిస్ చేసుకున్నా.. స్టార్ హీరోయిన్ కామెంట్స్
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 14, 2025 | 8:02 AM

Share

చేసిన తక్కువ సినిమాలే అయినా కూడా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు.  రీసెంట్ డేస్ లో చాలా మంది హీరోయిన్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ ముద్దుగుమ్మ చేసింది మూడు సినిమాలు అందులో రెండు బ్లాక్ బస్టర్స్ ఒకటి అట్టర్ ఫ్లాప్. ఇంతకూ ఆ చిన్నది ఎవరో తెలుసా.? తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. తన నటీన, అభినయంతో కట్టిపడేసింది ఈ చిన్నది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఒక్క అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఈ చిన్నదానికి ఇప్పుడు అవకాశాలుతక్కువయ్యాయి. ఇటీవలే ఓ బ్లాక్ బస్టర్ మూవీలో ఓ చిన్న రోల్ చేసింది. ప్రస్తుతం సైలెంట్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.?

కొన్ని సినిమాలతోనే పాపులర్ అయిన ఈ చిన్నది ఎవరో కాదు.. బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. అందాల భామ మృణాల్ ఠాకూర్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. మరాఠీ బుల్లితెరపైకి నటిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత నెమ్మదిగా కథానాయికగా మారింది. హిందీలో హీరోయిన్ ఆఫర్స్ అందుకుంటూ అద్భుతమైన నటనతో మెప్పించింది. మృణాల్ కు ఎక్కువగా క్రేజ్ వచ్చింది మాత్రం తెలుగు సినిమాతోనే. డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది.

ఇందులో సీతామహాలక్ష్మీ పాత్రలో అందం, అభినయంతో కట్టిపడేసింది. దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది. తెలుగుతోపాటు అటు హిందీలోనూ మరిన్ని ఆఫర్స్ అందుకుంది. అయితే ఫ్యామిలీ మ్యాన్ సినిమా తర్వాత మృణాల్ సైలెంట్ అయ్యింది. ఈ సినిమా నిరాశపరచడంతో మృణాల్ కు అంతగా ఆఫర్స్ రావడం లేదు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలే కల్కి సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. ఇదిలా ఉంటే తాజాగా మృణాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మృణాల్ మాట్లాడుతూ.. నా కెరీర్ బిగినింగ్ లో నేను చాలా ఆఫర్స్ వదులుకున్నా.. ఆ సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్ కారణంగా నా పేరెంట్స్ వద్దన్నారు. ఇంటిమేట్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ చేసినప్పుడు నేను భయపడతాను. అందువల్లే చాలా ఆఫర్స్ కు నో చెప్పా.. ఆతర్వాత నా పేరెంట్స్ ను కూర్చోబెట్టి వివరించా.. ఇంటిమేట్ సీన్స్ అనేవి సినిమాలో భాగమే.. నేను నో చెప్పడం వల్ల మంచి అవకాశాలను మిస్ చేసుకున్నా.. అలా అని అన్ని అలాంటి సినిమాలే చేస్తానని కాదు అంటూ చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లలను కనండి.!
పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లలను కనండి.!
10 రోజుల ఛార్జీతో 30 రోజుల ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
10 రోజుల ఛార్జీతో 30 రోజుల ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
గువహతి ఎయిర్‌పోర్ట్‌ను చూసి ఆశ్చర్యపోయిన రష్యన్‌లు.. వీడియో వైరల్
గువహతి ఎయిర్‌పోర్ట్‌ను చూసి ఆశ్చర్యపోయిన రష్యన్‌లు.. వీడియో వైరల్
బొల్లారం చిన్నారి హత్య కేసు నిందితుడు విక్రమ్ అరెస్ట్
బొల్లారం చిన్నారి హత్య కేసు నిందితుడు విక్రమ్ అరెస్ట్
సముద్ర చిలుకకు ప్రాణం పోసిన అధికారులు.
సముద్ర చిలుకకు ప్రాణం పోసిన అధికారులు.