Mrunal Thakur: సీతారామం తర్వాత అందుకే గ్యాప్ తీసుకుందట.. ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన మృణాల్

|

Apr 07, 2023 | 6:53 AM

బాలీవుడ్ లో షాహిద్ కపూర్ నటించిన జెర్సీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో మృణాల్ కు మంచి గుర్తింపు వచ్చింది.

Mrunal Thakur: సీతారామం తర్వాత అందుకే గ్యాప్ తీసుకుందట.. ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన మృణాల్
Mrunal Thakur
Follow us on

ఒకేఒక్క సినిమా మృణాల్ ఠాకూర్ ను ఓవర్ నైట్ లో స్టార్ ను చేసింది. హిందీ ఇండస్ట్రీలో సీరీయల్స్ లో నటిస్తూ… ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. బాలీవుడ్ లో షాహిద్ కపూర్ నటించిన జెర్సీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో మృణాల్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత తెలుగులో సీతారామం సినిమాలో నటించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించారు. అఅందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సీతామహాలక్ష్మీ పాత్రలో మృణాల్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సీతారామం సినిమా తర్వాత మృణాల్ తెలుగులో నటించడానికి కాస్త గ్యాప్ తీసుకుంది. బాలీవుడ్ లో మాత్రం వరుసగా సినిమాలు చేస్తోంది. సీతామహాలక్ష్మీ పాత్రలో పద్దతిగా నటించిన మృణాల్ హిందీలో మాత్రం రెచ్చిపోయి అందాలు ఆరబోస్తోంది ఈ చిన్నది.

అయితే సీతారామం సినిమా తర్వాత మృణాల్ తెలుగులో నటించడానికి గ్యాప్ తీసుకుంది. ఇక ఇప్పుడు నేచురల్ స్టార్ నాని సరసన నటిస్తోంది ఈ చిన్నది.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలుగులో గ్యాప్ తీసుకోవడం పై స్పందించింది మృణాల్.  సీతారామం సినిమా తరువాత నేను పలువురు దర్శక నిర్మాతలను కలిశాను. సీతామహాలక్ష్మిలాంటి అద్భుతమైన పాత్రను చేశారు. మీరు ఇంతకన్నా మంచి పాత్రలో చేయాలి అంటే మాకు కొంత సమయం పడుతుందని చెప్పారు. అద్భుతమైన పాత్రలో నటించడం కోసమే మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉండటంవల్ల గ్యాప్ వచ్చిందని చెప్పుకొచ్చింది.