october 1st: ఊరు, పేరు లేని సినిమా మరెవరిదో కాదు… అసలు విషయాన్ని వెల్లడించిన చిత్ర యూనిట్.

Movie Unit Clarifies About October 1st: హీరో, హీరోయిన్‌, దర్శకుడు, చివరికి సినిమా పేరు కూడా లేకుండా కేవలం విడుదల తేదీనే ప్రకటిస్తూ విడుదల చేసిన ఓ పోస్టర్‌ తాజాగా నెట్టింట్లో తెగ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే...

october 1st: ఊరు, పేరు లేని సినిమా మరెవరిదో కాదు... అసలు విషయాన్ని వెల్లడించిన చిత్ర యూనిట్.
Follow us
Narender Vaitla

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 04, 2021 | 12:15 PM

Movie Unit Clarifies About October 1st: హీరో, హీరోయిన్‌, దర్శకుడు, చివరికి సినిమా పేరు కూడా లేకుండా కేవలం విడుదల తేదీనే ప్రకటిస్తూ విడుదల చేసిన ఓ పోస్టర్‌ తాజాగా నెట్టింట్లో తెగ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

కుర్చీలో ఓ ఖర్చీఫ్‌ వేస్తున్న ఫొటోను షేర్‌ చేసి అక్టోబర్‌ 1న సినిమా విడుదల అని ఓ సినిమా ప్రచారాన్ని చిత్ర యూనిట్‌ వినూత్నంగా చేపట్టింది. ఈ సినిమా ఎవరిది అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక ఒకరోజు తర్వాత ఈ సినిమా విశేషాలను వెల్లడించాడు దర్శకుడు. ఇంతకీ ఆ సినిమాలో ఎవరు నటిస్తున్నారనేగా మీ సందేహం. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తుండగా.. గోపీచంద్‌ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో గోపీ చంద్‌ ఒక క్రిమినల్‌ లాయర్‌గా నటించనున్నాడు. ఇక సినిమా షూటింగ్‌ను మార్చిలో మొదలు పెడతామని చెప్పిన చిత్ర యూనిట్‌ విడుదల తేదీ (అక్టోబర్‌ 1) విషయంలో మాత్రం అదే పట్టుదలతో ఉన్నారు. అసలు షూటింగ్‌ మొదలుకాక ముందే విడుదల తేదీని ఎలా ప్రకటించారంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ సినిమా గురించి చిత్ర యూనిట్‌ మరో పోస్టర్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో సినిమాకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. ఇక ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, గీతాఆర్ట్స్‌2 సంయుక్తంగా నిర్మిస్తుండడం విశేషం. మరి సినిమా షూటింగ్‌ మొదలుకాక ముందే పబ్లిసిటీని ఈ రేంజ్‌లో మొదలుపెట్టిన మారుతీ విడుదల వరకు మరెన్నీ వింతలు చూపిస్తాడో చూడాలి.

Also Read: Yadadri Temple: యాదాద్రి ఆలయ స్తంభాలపై సంపూర్ణ రామాయణ ఘట్టాలు.. చూసేందుకు రెండు కళ్లూ చాలవు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!