సినిమాల్లో చెప్పడమే కాదు, రియల్ లైఫ్ లోనూ చేసి చూపించాలని అంటున్నారు మోహన్‌లాల్. ఆయన ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అందరికీ చెప్పడమే కాదు… చేసి చూపిస్తున్నారు. లాక్‌డౌన్ టైమ్‌ని ప్రైవేట్ ఆర్గానిక్ ఫార్మ్ లో స్పెండ్ చేస్తున్నారు. ఎర్నాకుళంలోని ప్రైవేట్ ఫార్మ్ లో లాల్ ఏట్టన్ తనకు నచ్చిన పంటలను పండిస్తున్నారు. తానే కాదు… తన ఫ్యాన్స్ కూడా ఇంటి టెర్రస్‌ల మీద, బాల్కనీల్లోనూ నచ్చిన పంటలను పండించాలని పిలుపునిచ్చారు. కాకరకాయలు, టమోటాలు, మొక్కజొన్నలు పండిస్తున్నారు లాల్. అంతే కాదు, సన్నిహితులకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి, అందులో ఉన్న లాభాలను గురించి కూడా వివరిస్తున్నారు.
ఆయన నటించిన దృశ్యం2 రీసెంట్‌గా ఓటీటీలో విడుదలై అమితమైన స్పందనను రాబట్టుకుంది. ఏజ్ మీద పడుతున్నా యాక్టింగ్ ఏ మాత్రం గ్రేస్ తగ్గకుండా, మరోవైపు కుర్ర హీరోల కంటే ఫాస్ట్ గా సినిమాలు కంప్లీట్ చేస్తూ సత్తా చాటుతున్నారు మోహన్ లాల్.